జంగారెడ్డిగూడెం,
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం వరద బాధితులను ఆదుకునేందుకు విరివిగా విరాళాలలివ్వాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. వరద విపత్తు నుంచి ప్రజలు రక్షించడానికి మేము సైతం అంటూ ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా స్పందించి స్వచ్ఛందంగా తోచినంత సహాయం అందించాలని ఆయన కోరారు. మంగళవారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం జంగారెడ్డిగూడెం పట్టణంలో విరాళాల సేకరణ ప్రారంభించారు.జిల్లాకార్యదర్శి నేతృత్వంలో మండల నాయకత్వ బృందం ఇంటింటికి తిరిగి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ నగర ప్రజలు వరదలకు విలవిలాడిపోయారని ,ధనిక పేద అనే తారతమ్యం లేకుండా ప్రజలంతా కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటపడిన ఎన్నో హృదయ ఉదారక సంఘటనలు చోటు చేసుకున్నాయని, ఆయన అన్నారు.అటువంటి ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు, సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు బాదితుల సహాయార్థం సిపిఐ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు సహాయంగా ఇతోధికంగా తమకు తోచిన విధంగా సహాయం అందించాలని ఆయన కోరారు. స్వచ్ఛంద సేవా సంస్థలు దాతలు సేవా దృక్పథం తో స్పందించి ముందుకు రావాలని ఆయన అన్నారు.
విజయవాడ నగర ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి ఆదిశగా భవిష్యత్తులో విజయవాడ నగరానికి ఎటువంటి ముంపు సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించి పదివేల కోట్లు గ్రాంట్ ఇవ్వాలని, సర్వస్వం కోల్పోయిన బాధితులకు జరిగిన నష్టాన్ని శాస్త్రీయ అంచనాలు వేసి నష్ట పరిహారాన్ని ప్రభుత్వం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి జంపన వెంకటరమణ రాజు, సహాయ కార్యదర్శి కుంచె వసంతరావు, మండల కమిటీ సభ్యులు గొలిమే బాలయేసు,పొడపాటి ఘటోత్కచుడు, కంకిపాటి రామారావు ,భూదే ఆశీర్వాదం తాళ్లూరి నాగరాజు, హనుమంతు, శ్రీను ,తదితరులు పాల్గొన్నారు