Subscribe Us

header ads

పట్టిన పాలెం వంతెన నిర్మాణం పూర్తి చేయాలి సిపిఎం పార్టీ డిమాండ్


 జంగారెడ్డిగూడెం,

ఏలూరుజిల్లా సెప్టెంబర్ 9 జంగారెడ్డిగూడెం మండలం పట్టేన్నపాలెం గ్రామంలో ఉన్నటువంటి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి ఎంజీవరత్నం పాల్గొనగా మండల కమిటీ సభ్యులు G సూర్య కిరణ్ మాట్లాడుతూ జోడే సూరి చందర్రావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలకు ప్రధాన రహదారి అయిన పట్టిన పాలెం వంతెన నిర్మాణం పూర్తి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వాలకు అధికారులకు సిద్ధ శుద్ధి ఉంటే పట్టిన పాలన వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన దళితులు ఏజెన్సీ ప్రాంతాల నుండి విద్య వైద్యం కొరకు జంగారెడ్డిగూడెం పట్టణం రావాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు గ్రామంలో ఈ వంతెన పూర్తి కాకపోవడంతో వచ్చే వరదనీటి ప్రవాహానికి గతంలో సుమారు పదిమందిపైగా ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే రెండు నియోజకవర్గాలకు సంబంధించిన చింతలపూడి నియోజకవర్గం శాసనసభ్యులు సొంగ రోషన్ పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రిబాలరాజు తక్షణమే స్పందించి 

ఈ ప్రధాన వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇప్పటికే ఈ బ్రిడ్జి నిర్మాణం పై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలు పరిష్కారం కోసం వినతి పత్రాలు అందించిన పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఇటీవల కురిసిన వర్షాలకు జరుగుతున్న ప్రమాదాలు దృష్టిలో ఉన్నప్పటికీ ఈ వంతెన ప్రస్తావన తీసుకు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు తక్షణమే స్పందించి వంతెన నిర్మాణం పూర్తయ్యేందుకు తగు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టిన పాలెం వంతెన నిర్మాణం పట్టిన పాలెం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులను దళితులను ఐక్యం చేసి ఆర్డీవో కార్యాలయం లేదా కలెక్టరేట్ వద్ద నిర్మాణం పూర్తయ్యేంతవరకు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ఏ ప్రభాకర్ రావు సిపిఎం నాయకులు పిల్లి పోతురాజు బి వసంతరావు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.