చాట్రాయి:-
చాట్రాయి మండలం లో ఇటీవల కురిసిన అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మండల వ్యవ సాయాధికారి (అగ్రికల్చరల్ ఆఫీసర్) బి శివశంకర్ రైతులకు పలు సూచనలుచేశారు. వరి పంట పండించే రైతులు అందరూ ఈ పంట నందు తమ పేర్లను నమోదు చేసుకున్న తరువాత ఈ. కే.వై.సీ చేయించుకోవాలని అలా చేయించుకొని ఎడల ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎం ఎస్ పి గరిష్ట ధర పొందుటకు వీలు కాదని తెలిపారు. మండలంలో మొన్నటి వరకు కురిసిన అధిక వర్షాలు మరియు సగటు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వలన వరి పంటకు దోమపోటు మరియు తెగుళ్లు సంక్రమించే అవకాశం ఉన్నదని,రైతులు కాబట్టి
దోమ ఉన్నట్లయితే మెట్రో జిన్ 50 శాతం డబ్ల్యూ జి 120 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలని, తామర పురుగు ఆకు కొనలను ఆశించి రసం పీల్చుతాయని, ఆకు కొనలు ముడుచుకొని పోయి సూది మొనవలె కనిపిస్తాయని దీని నివారణకు మోనోక్రో టోఫాస్ లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్లు లేదా పిప్రో నిల్ రెండు మిల్లీలీటర్లకు ఒక లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలని తెలిపారు. ముఖ్యంగా రైతులు డ్రోన్ ను ఉపయోగించి ఆధునిక పద్ధతులు పాటించాలని దీని వలన రైతులకు సమయం ఆదాతో పాటు తక్కువ ఖర్చుతో లాభ దాయకంగా ఉంటుందని, డ్రోన్ మండల రైతులకు అందుబాటులో కమల రాణి కొత్తగూడెం వారి వద్ద ఉన్నదని ఫోన్ 6302329833 నంబర్లో సంప్రదించవచ్చని తేలిపారు.