Subscribe Us

header ads

ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం విశ్వబ్రాహ్మణులసమస్యలపరిష్కారానికికృషిచేస్తా-ఎంఎల్ఏ బడేటి.


ఏలూరు:-

ఏలూరుజిల్లా ఈ విశ్వాన్ని సృష్టించి విశ్వంలోనిమానవాళితోసహా సకలజీవరాసులకు దేవతలకు ప్రాణశక్తి నొసగినది విశ్వకర్మభగవానుడని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ థర్మపీఠం ఉపసభాపతి తుమ్మోజురామలక్ష్మణా చార్యులు పేర్కొన్నారు.ముఖ్య అతిధి గా పాల్గొన్న శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ (చంటి) మాట్లాడుతూ 
సృజనాత్మకత నైపుణ్యంకలిగిన విశ్వబ్రాహ్మణులకు అండగాఉంటూ వారు ఎదొర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాననిహామిఇచ్చారు.
మంగళవారం స్థానిక వైఎంహెచ్ఏ హాలులో విశ్వకర్మభగవానుని యజ్ఞ మహోత్సవాలు 
శ్రీవిశ్వబ్రాహ్మణ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో ఘనంగానిర్వహించారు.ఉదయం పుణ్యదంపతులచే
యజ్ఞ మహోత్సవం విశ్వకర్మ ధ్వజారోహణం పూజాకార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం శ్రీ విశ్వబ్రాహ్మణ నూతన కార్యవర్గాన్ని సంఘ గౌరవ అధ్యక్షులు వేముల దుర్గాప్రసాద్ పరిచయంచేశారు.
ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభాకార్యక్రమానికి సంఘ అధ్యక్షులు సింహాద్రి భృంగాచార్యులు అధ్యక్షత వహించగా సభాసంధానకర్తగా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా కార్యదర్శి అప్పలభక్తుల శివకేశవరావు ( శివశ్రీ)వ్యవహరించారు. విరాట్ విశ్వకర్మ -విశ్వసృష్టి
సమాజంలో విశ్వబ్రాహ్మణుల ప్రధాన్యత అనే అంశాలపై ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ థర్మపీఠం రూపొందించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శివశ్రీ వివరించారు ధర్మపీఠం ఉపసభాపతి తుమ్మోజురామలక్ష్మణా చార్యులు ప్రసంగిస్తూ విశ్వకర్మ పంచముఖోధ్భవులైన సానగ సనాతనాది పంచరుషులు పూర్వరుషులని వారు గోత్ర ఋషులుగా ఉధ్భవించిన మను,మయాది పంచబ్రహ్మలవారసులే విశ్వబ్రాహ్మణులుగా ర్కొన్నారు.

సర్వముశూన్యంగా ఉన్న సమయంలో వి శ్వకర్మమహాశక్తి విశ్వకర్మ పంచభూతాత్మకమైన ఈవిశ్వాన్నిసృష్టించినదని విశ్వసృష్టి క్రమాన్ని ఋగ్వేదం పదవమండలం స్పష్టంచేస్తున్నదని తెలిపారు. వైశ్వకర్మణహోమము ద్వారా విశ్వకర్మ అనుగ్రహాన్ని పొంది సర్వమానవాళి సకలశుభాలాను పొందవచ్చు అని ఆయనతెలిపారు.శివశ్రీ మాట్లాడుతూ  శిల్పశాస్త్రాన్ని అనుసరించి భగవంతునికే రూపాన్నికల్పించి. విశ్వశక్తిని ఆకర్షించేవిధంగా దేవాలయాన్ని, అందుదేవతావిగ్రహాన్నిశిల్పించి, వివధశేవలకు అవసరమైన ఆభరణాలు,పల్లకి రథంవంటి నిర్మాణాలతో దేవాలయ వ్యవస్థ నిర్మాతలు విశ్వబ్రాహ్మణులన్నారు జనబాహుళ్యాన్నిభక్తిమార్గంవైపు మళ్ళించేందుకు కారకులై,భారతదేశశిల్పసంపదతో మనదేశానికి కోట్లాది రూపాయల విదెశిమారక ద్రవ్యాన్ని  ఆర్జించిపెడుతున్న పంచశిల్పుల వారసులైన విశ్వబ్రాహ్మణులకు ఆలయపాలకవర్గాలలో ప్రభుత్వం స్థానం కల్పించాలని ఆ విధంగా కృషిచేయాలని శాసనసభ్యలను కోరారు.

ఈమేరకు నివేదికను అందచేశారు.శ్రీవిశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సింహాద్రి భృంగాచార్యులు మాట్లాడుతూ ఏలూరులో 20వేలమందివిశ్వబ్రాహ్మణులున్నారని వీరిఅవసరాలకొరకు కమ్యూనిటీ హాలు కొరకు స్థలాన్ని కేటాయించాలని,అలాగే స్థానిక కామాక్షి విశ్వబ్రాహ్మణ ధర్మసత్రవకు విశ్వబ్రాహ్మణుల ప్రాతినిధ్యం తో పాలకవర్గంనియమించాలని కోరారు.
.విశ్వకర్మపతాకాన్ని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ లక్కోజు గోపి ఆవిష్కరించగా సంఘప్రధానకార్యదర్శిమానేపల్లి నాగేశ్వరరావు స్వాగతంపలికారు.కార్యక్రమంలో ఆత్మీయ అతిధులుగా ,సంఘం లీగల్ ఎడ్వయిజర్ సున్నంబ్రహ్మం,గొల్లపల్లి కామేశ్వరరావు శిధ్ధాంతి,యలబాక కృష్ణ,కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పొట్నూరి శివరావు,గౌరవ అధ్యక్షులు కర్రి సత్యన్నారాయణ, సంఘం కోశాధికారి నాగమల్లి దుర్గా సురేష్, ఉపాధ్యక్షులు దాసోహం వెంకటేశ్వర చార్యులు దాస్ రోజు వీరాచారి రాపాక వెంకట సన్యాసిరావు వీర్నివైణతేశ్వరరావు.తదితరులు పాల్గొన్నారు.సాయంత్రం పురవీధులలో విశ్వకర్మభగవానుని మంగళవాయిద్యాలతో విచిత్ర వేష ధారణ తో ఊరేగింపు జరిపారు.