జంగారెడ్డిగూడెం:-
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం చత్రపతి శివాజీ త్రి శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు అధ్యక్షతన ఓజోన్ డే ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ బోజోన్ యొక్క క్షీణత కు కారణమైన క్లోరో ఫ్లోరో కార్బన్స్ గురించి వాటి వాడకం తగ్గిస్తే కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఐ.క్యూ.ఏ.సి.కోఆర్డినేటర్, రసాయన శాస్త్ర అధ్యాపకులు
డాక్టర్. ఎమ్.మధు మాట్లాడుతూ కొన్ని క్లోరో ఫ్లోరో కార్బన్ లను విడుదల చేసేటువంటి రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాహనాల నుండి వెలువడే పొగ మొదలైన వాటి ద్వారా కెమికల్ రియాక్షన్స్ జరగటం వల్ల భూమి తొందరగా వేడెక్కటం, ఓజోన్ పొర క్షీణించడం జరుగుతున్నాయని ఓజోన్ పొర క్షీణించినట్లయితే అనేక రకాలైనటువంటి చర్మ సంబంధ వ్యాధులు వస్తాయ ని కాబట్టి ఓజోన్ పొరను రక్షించుకోవలసిన బాధ్యత మన చేతుల్లోనే ఉందని అవసరమైన మేరకే రిఫ్రిజిరేటర్లు ఎయిర్ కండిషనర్లు ఉపయోగించాలని అన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ 1 కోఆర్డినేటర్ నిట్టా వినయ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వలన కూడా వర్షపు నీరు భూమి లో ఇంక కుండా ఎక్కువ మోతాదులో సముద్రంలో కలిసిపోతుందని దీనివల్ల కూడా భూమి వేడెక్కుతుంద ని
ఇది కూడా ఒక రకమైన ప్రకృతి విపత్తుకు కారణమవుతుందని అందువలనే స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపడుతూ కళాశాలను ప్లాస్టిక్ రహిత క్యాంపస్ గా చేస్తున్నామని అన్నారు.ఎన్ఎస్ఎస్ 2 కోఆర్డినేటర్ డాక్టర్ గల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముందుగా అందరం తమ వంతు భాగంగా చెట్లను నాటాలని చెట్లను ఎక్కువగా పెంచడం వల్ల కొంతవరకు కాలుష్యాలని అరికట్ట వచ్చని అందువల్ల అందరూ చెట్లు పెంచే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.