జంగారెడ్డిగూడెం:-
ఏలూరుజిల్లా ఏలూరు సి ఆర్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఈ నెల 14,15 తేది లలో సైకో షోటోకన్,కన్నింజుకు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో జంగారెడ్డిగూడెం మండలం లోని లక్కవరం గ్రామానికి చెందిన అక్క చెల్లెల్లు చిలుకూరి ఉద్విత సోనాక్షి ఇద్దరు విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించినట్లు శిక్షకుడు ఈశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంపిటేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ మన విద్యార్థులు కష్టపడి ఉత్తమ ప్రతిభ కనబరిచారని ఆయన అన్నారు.
ఇటీవల కాలంలో ఆడపిల్లల ఆత్మ రక్షణకు కరాటే చాలా ఉపయోగకరమని ఆయన తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను లక్కవరం ఏఎస్ఐ తో పాటు గ్రామ టిడిపి అధ్యక్షులు గద్దె వెంకట సుబ్బారావు ఎస్ఎంసి చైర్మన్ దల్లి దుర్గారెడ్డి కొదమ వెంకటేశ్వరావు వారిని అభినందించారు అయితే ఈ నెల 14 15 తారీకు లో జరిగిన కరాటి ఛాంపియన్ షిప్ కార్యక్రమంలో విద్యార్థులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, సినీస్టార్ సుమన్ తల్వార్ తపన చౌదరి వీరిని అభినందించారు.