జంగారెడ్డిగూడెం
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నందు చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ కి (సీఎం రిలీఫ్ ఫండ్ ఏపీ) వరద బాధితుల సహాయార్థం జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో 12 లక్షల 66 వేల రూపాయలు చెక్కులను టిడిపి జనసేన బిజెపి నాయకులు అందజేశారు
జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో దాతలు విద్యాసంస్థలు 5 లక్షల రూపాయలు, డాక్టర్లు (హాస్పిటల్స్) వారు 5 లక్షల5 వేలు, వ్యాపారస్తులు 2 లక్షల 5 రూపాయలు, ప్రభుత్వ సిటిజనులు 56 వేలు రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి అందించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ వరద బాధితుల కష్టాలను చూసి చలించి సేవా దృక్పథంతో సహకారం అందించిన దాతలను పేరుపేరునా మనసుపూర్తిగా అభినందించారు. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ 12,66,000 లక్షల రూపాయలను చెక్కులను చంద్రబాబు నాయుడు కి అందజేస్తానని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జంగారెడ్డిగూడెం టిడిపి జనసేన బిజెపి నాయకులను అభినందించారు
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ఈడా సూర్యచంద్ర శ్రీనివాసరావు, నంబూరి రామచంద్ర రాజు, తూటికుంట రాము, మహంకాళి రామ్మోహనరావు, చిత్రోజు తాతాజీ, వలవల తాతాజీ, మిడత పెంటయ్య, సత్యవరపు బుల్లయ్య, రామాంజనేయులు, తడికి మళ్ళీ శివ, సత్య కృష్ణ, అభిరామ్ పాల్గొన్నారు