ప్రతి పాఠశాలలలో పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యను అందించాలని నిడుమోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి.హెచ్ అన్నపూర్ణమ్మ సూచించారు. పాఠశాల నందు బుధవారం మొవ్వ, గూడూరు, పామర్రు, మండలాలలోని ఎం.పి.యు.పి పాఠశాలలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో గల హిందీ ఉపాధ్యాయులకు సబ్జెక్ట్ కాంప్లెక్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ.. టీచ్, టూల్ పై దృష్టి సాధించాలని వెల్లడించారు.
హింద సబ్జెక్టులో సైతం అత్యధిక మార్కులు వచ్చే విధంగా విద్యార్థులను తీర్చి దిద్దటమే కాకుండా హిందీ భాషలో కూడా పట్టు సాధించి అనర్గళంగా హిందీ మాట్లాడే రీతిలో తయారు చేయాలని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాలల్లోని విద్యార్థిని, విద్యార్థులకు ఈ అంశంపై డెమోక్రస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ చాంద్ భాషా, రహమాన్, చాంద్ ఉస్మాని, కరీమున్నీసా ప్రసాద్, మొదలగు వారు పాల్గొని పలు సూచనలు అందించారు.