Subscribe Us

header ads

సుపరిపాలన అంటే చంద్రబాబు పాలనే: ఎమ్మెల్యే యార్లగడ్డ


 గన్నవరం :కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వంద రోజుల పాలనలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజల కోసం ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. శుక్రవారం గన్నవరం మండలం పామర్తి నగర్ , అల్లా పురం గ్రామాల్లో "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం నిర్వహించారు . కార్యక్రమం సందర్భంగా పామర్తి నగర్ లో ఏర్పాటు చేసిన గ్రామ సభ లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ సుపరిపాలన అంటే మంచి పరిపాలన అని అది కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తుందని అన్నారు . దీనికి నిదర్శనమే ఒకటవ తారీకున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు , ఒకటో తారీకునే వృద్దులకు , వికలాంగులకు పింఛన్లు అందించడం అన్నారు . రాష్ట్ర బడ్జెట్ ను ఐదు రెట్లు పెంచిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని పేర్కొన్నారు .చంద్రబాబు కన్నా మంచి అడ్మినిస్ట్రేటర్ రాష్ట్ర ప్రజలకి దొరకరనీ స్పష్టం చేశారు. గత ముఖ్యమంత్రి వ్యక్తిగత స్వలాభం కోసం పని చేస్తే ఇప్పటి ముఖ్యమంత్రి ప్రజల కోసం పని చేస్తున్నాడని అన్నారు . సుపరిపాలన కోసం చంద్రబాబు పని చేస్తున్నారన్నారు . నాకు ఘన విజయాన్ని కట్టబెట్టిన గన్నవరం ప్రజల కోసం ఐదేళ్లు కష్టపని పని చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రం లోనే బెస్ట్ నియోజక వర్గం గా గన్నవరం ను తీర్చిదిద్దుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వరరావు , ప్రసాద్ , తహసీల్దార్ శివయ్య , జనసేన నేత లక్ష్మణ రావు , బీజేపీ నాయకులు అన్నపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ,నీటి సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల గోపాల కృష్ణ, చిమట రవి వర్మ , నరేంద్ర అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు .