Subscribe Us

header ads

సంక్షోభంలో కూడా సంక్షేమం అభివృధ్ధే కూటమి ప్రభుత్వ


 చాట్రాయి..

 సంక్షోభంలోనూ సంక్షేమం సాధించి, అభివృద్ధికి రెక్కలు తొడిగిన కూటమి ప్రభుత్వం "ఇది మంచి ప్రభుత్వం" అని ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావుకొనియాడారు.ఆదివారం ఉదయం ఏలూరు జిల్లా చాట్రాయి మండలం, చనుబండ గ్రామం లో కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా "ఇది మంచి ప్రభుత్వం"ప్రచారకార్యక్రమం సచివాలయం -1లో సచివాలయంఅధికారులు కూటమి నాయకులు ప్రారంభించడం జరిగింది.
గత 100 రోజులలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ సచివాలయ అధికారులు, కూటమి నాయకులు ఇంటింటికీ తిరిగి "ఇది మంచిప్రభుత్వం"కరపత్రాలను పంచుతూ, డోర్ స్టిక్కర్లు అంటిస్తూ కార్యక్రమంనిర్వహించారు.