జంగారెడ్డిగూడెం:-
ఏలూరుజిల్లా బుడమేరు వరద ప్రాంతాలలో విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ ఇంటి పన్నులు వసూలు చేసే కార్యక్రమాన్ని విరమించుకోవాలని అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేసింది. కమిషనర్ చెప్పారని, అడ్మిన్ సెక్రటరీ ఇండ్ల పన్నులు వసూలునోటీసులుఇవ్వడాన్ని, అఖిలభారత ప్రగతి శీల రైతుసంఘం (. ఏఐపి కె ఎస్ ) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కన్వినింగ్ కమిటీతీవ్రం గా ఖండిస్తున్నది. పన్ను వసూళ్లు నిలుపు దల చేయా లని డిమాండ్ చేస్తుంది. బుడమేరు, కృష్ణా నది వరదలు వచ్చిపోయి పది రోజులు కాకపోయినా, వరద కష్టాలు ఇంకా తీరక ముందే ఇండ్ల లో ఉన్న బురద శుభ్రం చేసుకుని పరిస్థితిలో ఉన్నారు. వరద తగ్గిన తర్వాత వీరికిభోజ నాలు,మంచినీరు, అన్ని సహాయ కార్యక్రమాలు నిలిపి వేసినారు.
అన్నిశాఖల అధికారులు ప్రజలకు జరిగిన నష్టంపై ఎన్యుమ రేషన్ రిపోర్ట్ ప్రభుత్వం కు పంపి, ఇంత వరకు ఏటువంటి సహ కారం, అందలేదు. ప్రజలు బురదలో ఉంటే, ఏమియు పనులు లేక, ఏవరైనా సహాయం చేస్తారేమో ఈ పూట గడుస్తుందేమో అని వరద బాధితులు, ఎదురు చూస్తూ ఉంటే, కనీస కనికరం లేకుండా పన్నులు వసూలు ఆపాలని, పన్ను లు పూర్తిగా రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్నిఏ ఐ పి కె ఎస్ డిమాండ్ చేస్తున్నది. ఈ లేఖను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి ఏ ఐ పి కె ఎస్ రాష్ట్ర కమిటీ పంపిస్తున్నది. ఈ కార్య క్రమం లో ఏ ఐ పి కె ఎస్ ఏ పి, రాష్ట్ర కన్వీనర్ ఎస్ కె గౌస్,ఎస్. రామారావు,జి ముత్యాల రావు,బి, సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.