Subscribe Us

header ads

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ను అందరూ వ్యతిరేకించాలి రాష్ట్ర జమాత్ ఇస్లా మి హింద్ అధ్యక్షుడు ఎండీ రఫీక్ పిలుపు.


 ఆంధ్ర ప్రదేశ్:-

మహమ్మద్ ప్రవక్త సమస్త మానవాళికి మార్గ దర్శకులు అని రాష్ట్ర జమాత్ ఇస్లామీ హింద్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ అన్నారు దేశ సమైక్యత , స్వేచ్చా సమానత్వం, మహిళలకి హక్కులు, ఆర్థిక పురోగతి లాంటి వాటివి మహ్మద్ ప్రవక్త భోధనల్లో సూచనలు గా ఉన్నాయి అని అన్నారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు చేయడానికి జాయింట్ పార్లమెంటరి కమిటీ నియమించిందని,ఇది కేవలం మత పరమైన రాజకీయం చేయడం కోసం జరుగుతున్న ప్రయత్నం అని రఫీక్ అన్నారు. అసలు వక్ఫ్ అంటే ముస్లిమ్ ల పూర్వీకులు కష్ట పడి సంపాదించిన ఆస్తులను దైవ మార్గంలో అప్పజెప్పడం జరిగింది అని అన్నారు.ఆ ఆస్తులను కాపాడటం కోసం వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది
 
అని ,వక్ఫ్ ఆస్తులు అంటే పూర్వీకులు సంపాదించిన స్థలాలు, పొలాలు ఉంటాయి అని,వాటిని పరిరక్షించడం మాత్రమే వక్ఫ్ బోర్డు విధి అని,ఇందులో ప్రభుత్వం నకు అజమాయిషీ లేదని రఫీ క్ అన్నారు.ఇప్పటి కే డే బై శాతం వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయి అని అన్నారు.అప్పట్లో హైందవ సమాజంలో దేవుని మాన్యాలు అని ఇస్తా రో అలానే ముస్లింలలో వక్ఫ్ భూములు ఉంటాయి అని,రాజ్యంగంలో మత పరమైన స్వేచ్చ అందరికీ ఉందని ,ముస్లింలు దాన ధర్మంగా ఏవైతే ఇచ్చిన స్థిర చరస్తులు ఉన్నా యో అవి ముస్లింల అభివృద్ధికి ఉపయోగించాలి తప్పా కేంద్ర ప్రభుత్వం పెత్తందారులు కు ఆప్పజెప్పడం కోసం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ప్రవేశ పెట్టడం సమంజసం కాదు అని అన్నారు.వక్ఫ్ బోర్డు వలన దేశ సంపదకు గాని ,దేశ సమైక్యతకు గాని ఏటువంటి నష్టం వాటిల్లాదని, కావాలనే మత విద్వేష లు రెచ్చ గొట్టేందుకే ఇలాంటి సవరణ బిల్లు ప్రవేశ పెట్టడం జరిగింది 

అని అన్నారు.ముస్లిమేతర సోదరులు అందరూ ఆలోచన చేయాలి అని,రానున్న కాలంలో వక్ఫ్ సవరణ బిల్లు లాగే దేవుని మాన్య భూములూ కు కూడా కేంద్రం సవరణ బిల్లు పేరుతో పెత్తందారులు కు అప్ప జెపుతుందని అన్నారు.ముస్లింలు ఏ విధంగా అయితే వక్ఫ్ సవరణ బిల్లు ను వ్యతిరేకిస్తున్నా రో అదే విధంగా ముస్లిమేతర సోదరులు కూడా ఈ బిల్లును వ్యతిరేకించాలని రఫిక్ కోరారు .తోటి వారికి సాయ పడాలి అన్నదే ఇస్లాం చెబుతుంది అని,అందులో భాగంగా గతంలో కానీ,ప్రస్తుత విజయవాడ వరదల్లో బాధితులకు గాని రాష్ట్ర జమాత్ ఇస్లామీ , ఐ వై యం, ఎస్ ఐ ఒ తరుపున కులమతాలకు అతీతంగా సహాయ కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు.ఇస్లాం అంటే ఎవరికి హాని చేయనిది అన్నారు.అందరూ రాజ్యాంగ స్ఫూర్తిని,లౌకిక తత్వాన్ని ,దేశ సమైక్యత ను కాపాడుకోవాలని కోరారు.