ఆనందపురం:-
ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం లో గల సొంఠ్యము గ్రామపంచాయతీ విందు వా నీ పాలెం గ్రామానికి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందగా ఇద్దరు మహిళలకు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆనందపురం పోలీసులు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి, భీమిలి పట్నం మండలం చెందిన జీరుపేట గ్రామానికి చెందిన చిల్ల మాధవరెడ్డి S/O తో గు నాయుడు (51) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు అనంతరం శనివారం సాయంత్రం చేపల వ్యాపారం చేసుకునే రమ్య,
గర గయ్యమ్మ వీళ్ళిద్దరును తన ఆటోలో ఎక్కించుకొని లంకెలపాలెం వద్దకు వెళ్లారు అక్కడ చెరువు చేపలు రొయ్యలు వాళ్ళిద్దరూ కొనుగోలు చేసుకుని ఆటోలో లోడ్ చేసుకొని తిరిగి శనివారం రాత్రి 12:30 సమయంలో తిరిగి లంకెలపాలెం నుండి ఆనందపురం వైపు వస్తుండగా ఆ యొక్క ఆటో బిందువానిపాలెం దగ్గరికి వచ్చిన తరువాత కేకే కోల్డ్ స్టోరేజ్ వద్దకు చేరుకునే సరికి ఆటో వెనుక వైపు గల టైర్ పంచర్ అయింది వెంటనే ఆటో ఆపి మాధవరెడ్డి ఆటోను రోడ్డు పక్కకు తీసి టైరు మారుస్తుండగా ఈ లోగా పెందుర్తి నుండి ఆనందపురం వైపు ఏపీ 16 TJ 4131 సిమెంట్ మిక్సర్ లోడుతో అతివేగముతో వస్తుండగా లారీ ఆటో వెనుక వైపు నుంచి ఢీకొని మాధవరెడ్డి తో పాటు ఆటోను కొంత దూరం ఈడ్చుకొని పోయింది.
ఈ సంఘటనలో మాధవరెడ్డి పైనుంచి లారీ వెళ్ళిపోవటంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ఆటోలో ఉన్న ఇద్దరు మహిళలు తీవ్రముగా గాయాలు పడగా వాళ్ళిద్దరూ వెంటనే తగరపువలస ఎన్ఆర్ఐ హాస్పిటల్కు తరలించి చికిత్స పొందుతున్నారు, అనంతరం ఆనందపురం సిఐ చింత వాసు నాయుడు కేసు నమోదు చేయగా ఎస్సై శివ కేసును దర్యాప్తు చేస్తున్నారు.