ఏలూరుజిల్లా కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం 100 రోజుల ప్రభుత్వ పాలనలో ప్రజలకు మేలు చేయడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్ళాము పామోలిన్ రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర చింతలపూడి నియోజకవర్గంలో మొదటి సమావేశం అల్లిపల్లిలోని పామోలిన్ రైతులతో ఎంపీ మహేష్ కుమార్స మావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పామోలిన్ రైతుల పక్షాన ప్రత్యేక చొరవ చూపించటం అదృష్టంగా భావిస్తున్నాం. మెట్ట ప్రాంత పామోలిన్ రైతుల కల నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందిపడిన ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు మేలు చేస్తున్నాం
ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గార్ల నాయకత్వంలో రైతులకు మరింత లబ్ది చేకూరుస్తాం. ఏలూరు జిల్లాలోని రైతులు మరియు చింతలపూడి ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ పామయిల్ కు గిట్టుబాటు ధర కోసం ఎంపీ కి చేసిన సూచన మేరకు ఎంపీ కేంద్ర ప్రభుత్వం మరియు వాణిజ్య పన్నుల శాఖ అధికారులను కలిసి రైతుల యొక్క గిట్టుబాటు ధర కోసం చర్చించి, పోరాడి ముడి చమురు (క్రూడాయిల్) పై ట్యాక్స్ ను 5.5 శాతం నుండి 27.5 శాతం వరకు పెంచే విధంగా కృషి చేసినారు. దీని వలన రైతులకు 1 టన్నుకు 1000 నుంచి 1500 వరకు ఈ నెల నుంచి పెరిగే అవకాశం ఉన్నది. కావున వచ్చేనెల పామాయిల్ టన్నుకు 15500 ధర పెరిగే అవకాశం
ప్రత్యేకంగా వర్జీనియా పొగాకు ధరలు పెంచడం కొరకు మరియు పామాయిల ధరను పెంచడం కొరకు మరియు వందేభారత్ రైలు ఏలూరులో స్టాప్ కోసం ఆర్డర్ కాపీ ని తెచ్చి ఇంప్లిమెంట్ చేసినందుకు ఆంధ్ర రాష్ట్ర రైతుల తరపున ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ప్రజల తరపున ఎంపీ శ్రీ.పుట్టా మహేష్ కుమార్ ఏలూరు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కి ధన్యవాదములు. ఈ కార్యక్రమం లో ఎంపీ గారిని ఎమ్మెల్యే ని పామోలిన్ రైతులు సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, పోలవరం టిడిపి ఇన్చార్జి బొరగం శ్రీనివాస్, ఏలూరు పార్లమెంట్ రైతు అధ్యక్షులు గుత్తా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు