Subscribe Us

header ads

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పుట్టినరోజు వేడుకలకు భారీ ఏర్పాట్లు

గోకవరం:-
జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పుట్టినరోజు వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.టిడిపి డైనమిక్ లీడర్ జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పుట్టినరోజు అక్టోబర్ 18 న ఘనంగా నిర్వహించేందుకు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జగ్గంపేట పార్టీ కార్యాలయం ఆవరణలో వేడుకలు నిర్వహించి జేవియర్ టవర్స్ అపార్ట్మెంట్ లో గల పార్కింగ్ స్థలం లోను,జె.వి.ఆర్ డైరీ స్థలంలోనూ,పార్టీ కార్యాలయం పక్కన ఏర్పాట్లకు,వెహికల్ పార్కింగ్ కు అనువైన స్థలాలను ఆదివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఈనెల 18 న తేదీ మా అభిమాన నేత మా దైవం మా తండ్రి జ్యోతుల నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా నియోజక వర్గం, జిల్లా,రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు జనసేన,బీజేపీ కూటమి నాయకులు జ్యోతుల నెహ్రూ అభిమానులు వేలాదిగా రావడం జరుగుతుందని తెలిపారు. వారందరికీ ఆతిథ్యం ఇవ్వడానికి అనువైన స్థలం కోసం పరిశీలిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కోర్పు సాయి తేజ,దేవరపల్లి మూర్తి,అనుకుల శ్రీకాంత్, బుర్రి సత్తిబాబు,కంచుమర్తి రాఘవ,దాపర్తి సీతారామయ్య,మారిశెట్టి రాధా,నలమాటి ఆనంద్, చేలికాని హరిగోపాల్,మంతిన రవిరాజు,కోడూరి సత్యనారాయణ,కాకర్ల కృష్ణాజి లు పాల్గొన్నారు.