ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం సీతారాంపురం స్టేజి సమీపంలో బుధవారం నాడు ద్విచక్ర వాహనంపై వస్తున్న ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. రెడ్డిగూడెం మండలంలో అసిస్టెంట్ సర్వేయర్ గా పనిచేస్తున్న కే శ్రీనివాసరావు విస్సన్నపేట నుంచి రెడ్డిగూడెం వస్తుండగా సీతారాంపురం స్టేజి వద్ద తన టు వీలర్ బండి అదుపుతప్పి కింద పడటంతో తలకు గాయమై రక్తస్రావం తీవ్రంగా అయింది.
ఇంతలో రెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మ్యాంగో మార్కెట్ అధినేత గోగులమూడి రవీందర్ రెడ్డి విస్సన్నపేట వెళ్తూ ప్రమాదం జరిగిన చోట ఆగి గాయపడిన శ్రీనివాసరావు దగ్గరకు వెళ్లి తనని వారి కారులో ఎక్కించుకొని రెడ్డిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు తీసుకువెళ్లి డాక్టర్ తో మాట్లాడి వైద్యం చేయించి మందులు ఇప్పించి
మండల సర్వేర్ కి సమాచారం ఇచ్చి వారు వచ్చేంతవరకు అక్కడే ఉండి వైద్యం చేయించి తన మానవత్వం చాటుకున్నారు. మండల కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది హాస్పిటల్ కి వచ్చి గాయపడిన శ్రీనివాసరావును చూసి మానవత్వం చాటుకున్న గోగులమూడి రవీందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఇలాంటి నాయకులు మన మండలంలో ఉండటం ఎంతో గర్వకారణం అని పలువురు అభినందించారు.