హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో 'దళిత రాజకీయాల్లో దామోదర్ రాజనర్సింహ ముందు తర్వాత ఇదే ఉంటాది.
కృష్ణ మాదిగ అన్నగారు దామోదర్ రాజనర్సింహ గారిని రాజీనామా చేసి బయటకు రమ్మని పిలుపునిచ్చారు.
కృష్ణన్న 30 సంవత్సరాలుగా ఎన్నో హామీలు ఎన్నోసార్లు ఈ పది రోజుల్లో అయిపోద్ది. ఈనెల అయిపోద్దన్న సంఘటనలు చాలా ఉన్నాయి.
ఆప్పుడు మీరు రాజీనామా చేశారా??.
ఇలాంటి హామీలు జరగలేదని అంశంపై రాజీనామా చేయాల్సివస్తే మీరు దాదాపు 200 సార్లు రాజీనామా చేయాలి.
గతంలో వంద రోజుల్లో వర్గీకరణ చేస్తానని చేయకుండా ఉన్నప్పుడు మనకి ఢిల్లీ వేదిక నుండి వెంకయ్య నాయుడు గారి ఆశీస్సులు తీసుకున్న మనం,ఆరు సంవత్సరాలుగా ఏబిసిడిలు ఇవ్వకపోతే ఉపరాష్ట్రపతి పదవిని రాజీనామా చేయమని అడిగరా??. లేదా మీ మిత్రులు కిషన్ రెడ్డి గారి రాజీనామా చేయమని అడిగారా???.
మీ గుండె మీద చెయ్యి వేసి చెప్పండి ఈ 25 సంవత్సరాల్లో దామోదర్ రాజనర్సింహ గారు గెలవాలని మీరు ప్రయత్నం చేశారా??ఓడించాలని ప్రయత్నించారా చెప్పండి.
తెలుగు రాష్ట్రాల్లో దామోదర్ గారికి ఒక ప్రత్యేకత ఉంది ఆయన ఒకళ్ళ దగ్గరికి వెళ్లి కాళ్లు పట్టుకున్న సందర్భాలు లేవు, ఇది కావాలని వెంపర్లాడిన సందర్భాలు లేవు.
మొన్న ఎలక్షన్లో మీ నాయకత్వంలో కాంగ్రెస్ కి ఓటు వేయొద్దని చెప్పారు, బిజెపికి చేసిన మాట వాస్తవం.
ఇప్పుడు కాంగ్రెస్ చేతులోకి ఏబిసిడిలు వచ్చాయి MRPS మిమ్మల్ని గెలిపించే బాధ్యత తీసుకుంటుంది వెంటనే వర్గీకరణ అమలు చేయాలని ఒకప్పుడు లాగా ప్రకటనలు ఎందుకు ఇవ్వడం లేదు.
వాస్తవం మాట్లాడుకోవాలంటే మీ కమిట్మెంట్ జాతి కమిట్మెంట్ గా ఒక పార్టీకి ఆల్రెడీ ఇచ్చేశారు,
65 ఏళ్లుగా ఒకే ఒక్క కుటుంబం ఎన్నిసార్లు ఓడిపోయినా,గెలిచిన ప్రజలతో ఉండి
ఆ నియోజకవర్గంలో నాయకత్వాన్ని బలపరుచుకుంటూ రావడం అంత సులభమైన పని కాదు.
భట్టి విక్రమార్క గారి మీద మీరు పోటీ చేసిన తర్వాత అత్యధికులు మాదిగలు ఉన్న మధిర నియోజవర్గం పోటీ చేసి వదిలేసారు, ఇప్పటికే మాదిగలకు రాలేదు. మీరు వదిలిపెట్టిన స్థానం నుంచే రాజకీయాలను శాసిస్తున్నారు. ఈ పరిస్థితి మన జాతి ఏ విధంగా తీసుకోవాలి.
దామన్న ఒక బలమైన శక్తి,కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిలో కీలకమైన నేత రాజకీయ ప్రాధాన్యతల దృశ్య కొన్నిసార్లు అన్నీ మనం అనుకున్నట్లు జరగవు అది ఈ 30 సంవత్సరాల్లో మీకు తెలిసే ఉంటది.
ఒకప్పుడు దామన్న నాన్నగారు రాజ నరసింహ గారు చర్మకారుల కోసం మనం పుట్టక ముందే పోరాడారు.
లిట్ క్యాప్ సంస్థను బలపరచడంలో ఆయనే మొదటి దిక్సూచి. హైదరాబాదులో చాలా కాలనీలు దామన్న గారి నాన్నగారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినవి.
దామన్న దమ్మేంటో sc/st sub plan ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు అందించినప్పుడు అందరికీ తెలుసు, ఆయన ఏం కోల్పోయాడో అందరికీ తెలుసు.
తెలంగాణ కల సహకారం కోసం"తెలంగాణ వాదాన్ని బలంగా కాంగ్రెస్ హై కమాండ్ ముందు వినిపించిన మేధావి.ఈ స్వప్నంలో ఆయన పాత్రని మర్చిపోవద్దు.
డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు పెద్ద యూనివర్సిటీలో మాదిగ వైస్ -ఛాన్సలర్ వేయడం, అతి చిన్న కులాలకు కూడా అవకాశాలు ఇవ్వడం, గుర్రం జాషువా బోయి భీమన్న లాంటి పీఠాలు ఏర్పరచడం మన జాతులకు గౌరవం దక్కే విధంగా ఆయన ప్రయత్నాలు ఒకటి కాదు బోలెడు చెప్పగలను.
దామన్న కి జరిగిన నష్టంలో మీ పాత్ర అధికంగా ఉన్నదన్న సంగతి అందరికి తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ గా సోనియా గాంధీ గారు సిఫార్సు చేస్తే రెడ్డి సామాజిక వర్గానికి అండగా ఉండి దాన్ని రద్దు చేయడానికి రకరకాల కుట్రలో మీరు చేయలేరా??.
ఇంత మీ ద్వారా నష్టం జరిగిన జాతి ప్రయోజనాల దృష్ట్యా కలిసి ప్రయాణం చేయడానికి మిమ్మల్ని దగ్గరగా తీసుకుని ముందుకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే.
ఒక పార్టీలో నాయకత్వాలు బలంగా తయరవ్వడమే కష్టం. అవేమీ మనం నిర్మించిన పార్టీలు కాదు, ఊరికినే వాళ్ళని బయటికి రావాలని కుట్రలు చేయడం మంచిది కాదు.
తిరువూరు ఎమ్మెల్యే కోలుకుపూడి శ్రీనివాస్ గారికి అధికారం తీసేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు, అది వాళ్ళ పార్టీ విధానం అనుకునే వదిలేసి ఉండొచ్చు, అంతేగా కృష్ణన్న.
ఎక్కడా కూడా ఒక పెద్ద నాయకుడు ఉండకూడదని మీ ఆలోచన కావచ్చు దామన్న విషయంలో మీరు 25 సంవత్సరాల నుంచి ఏదో విధంగా దెబ్బ తీయాలని కుట్రలోనే ఉన్నారు.
ప్రపంచంలో మాదిగ చమార్ గా పిలవబడే జాతుల్ని శక్తివంతులుగా తీర్చిదిద్దిన తత్వవేత్త "సంత్ గురు రవిదాస్" గారి తత్వాన్ని మన జాతికి అందించడానికి ప్రయత్నించిన మంచి సందర్భాన్ని కూడా విఫలం చేయడానికి ప్రయత్నించారు.
ఇదెక్కడి న్యాయం, జాతిని బలపరిచే ప్రయత్నం మీకు ఇష్టం లేని వ్యవహారంగా ఉన్నది.
అసలు తెలంగాణలో బిజెపి ఇప్పటికీ ఏబిసిడి వర్గీకరణ గురించి పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు, ఎందుకు మాట్లాడరు అన్ని అడిగిన దాఖలాలు లేవు.
కృష్ణన్న... బిజెపి పార్టీలో ఉన్న మాదిగలు కూడా గగ్గోలు పెడుతున్నారు, కృష్ణన్న ని అడ్డుపెట్టుకుని పార్టీలో మాదిగలను ఎవరు ప్రోత్సహిస్తాలేదని అనుకుంటున్నారు.
మీరు పార్టీలో ఉన్న మాదిగల్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ మీ బలాన్ని చూపించుకుంటున్నారని వాళ్ల వాదన.
ఈ మధ్యకాలంలో మాదిగలు రాజకీయ నాయకత్వంలో చాలామంది నాయకులు నిలదొక్కుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.
కృష్ణన్న ఒక్కసారి దామన్నను అర్థం చేసుకో... ఎన్నో సందర్భాల్లో మీరు ఆయన అవకాశాలు అడ్డుకున్న, ఆయన మీద స్టేట్మెంట్లు ఇచ్చిన ఒక సందర్భంలో కూడా మీ మీద స్టేట్మెంట్లు ఇవ్వడం గానీ, లేదా ఏదైనా సంఘాలు మాట్లాడుతానన్న ఆయన మాట్లాడమని చెప్పరు, దమాన్నా ఉత పదం ఆరే
....వదిలేయండి. పర్వాలేదు అంటారు తప్ప ఒకరిని ఎక్కదొసి మాట్లాడించే ప్రయత్నం చేయరు.
చిన్న మనసు కూడా ఆయనకు ఉండదు
అందుకే దామన్నది ఎప్పుడు పెద్ద మాదిగ పాత్ర.
దామన్న రాజకీయంగా ఆణగదొక్కడానికి ఒకసారి మెదక్ వేదికగా మా జాతికి గీతారెడ్డి బెస్ట్, దామన్న మా జాతికి ఉపయోగం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు.
మరి ఇప్పుడు అదే గీతారెడ్డి గారి దగ్గరికి వెళ్లి వర్గీకరణ చేయమని ఎందుకు అడుగుతా లేదు.
ఆరోజు బలమైన వర్గాల శత్రువు దామన్న, దామన్న బలహీనపరచడానికి మీరు పావుగా మారలేదా?? అసలు మీ ప్రయోజనాలు ఏంటో కొన్ని సందర్భాల్లో అర్థం కావడం లేదు.
ఇలాంటి కాలంలో ఒక అద్భుతమైన నాయకుడు "దామన్న"ఒక్కడే ఉన్నాడు దయచేసి ఆయన నాయకత్వం బలహీనపడాలని కోరుకోకండి.
"*ఆయన నాయకత్వం ఎప్పుడు కూడా మన జాతులకు బలం*".
జై దమాన్న, జై జై దామన్న.
మా దామన్న నాయకత్వం వర్ధిల్లాలి.
మీ బాపిరాజు గెడ్డం
President INFORM International