ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం పట్టణంలోని శేషాద్రి నగర్ నందలి శ్రీగౌరీ సుభద్ర పిరమిడ్ ధ్యానకేంద్రం అనుబంధ మైత్రేయ మందిరంలో ది జంగారెడ్డిగూడెం పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ నిర్వహణలో జనవరి 28,ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకూ మహా ఆరోగ్య అవగాహన సదస్సు జరుగుతుందని,ఈ కార్యక్రమంలో సన్ స్పిరిచ్యువల్ సొసైటీ వ్యవస్థాపకులు,ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్
విక్రమాదిత్య ముఖ్యవక్తగా పాల్గొని ప్రకృతి మనకు అందించి అందుబాటులో ఉంచిన కూరగాయలను ఉపయోగించడం ద్వారా తలనొప్పి నుండి కాన్సర్ వరకూ గల రోగాలను దరిచేరకుండా చేసుకొనే విధానం మరియు దీర్ఘరోగాలకు కాయగూరలు ద్వారా అందే చికిత్స పై ప్రత్యక్షంగా ముఖాముఖీ అవగాహన కలిగించనున్నారని పిరమిడ్ ట్రస్ట్ అధ్యక్షులు కాకి రామకృష్ణ, కార్యదర్శి తటవర్తి కృష్ణ తెలిపారు.
ఆరోగ్యాభిలాషులు,ధ్యానులు, వివిధ స్వచ్చంద సంస్థలు, ఆధ్యాత్మిక, ధార్మిక సాధనా మార్గంలోనివారు, జ్ఞానాభిలాషులు మరియు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొనవల్సినదిగా ట్రస్ట్ ప్రతినిధులు ఆహ్వానించారు.
కాగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ దివ్యఆశీస్సులతో ది జంగారెడ్డిగూడెం పిరమిడ్
స్పిరిచ్యువల్ ట్రస్ట్ ప్రతీ నెలా ఆరోగ్య అవగాహన ఒకరోజు శిక్షణా శిబిరం నిర్వహించడంతో పాటు ప్రత్యేక సందర్భాల్లో నిపుణులను రప్పించి నేరుగా అవగాహన అందిస్తున్న క్రమంలో ఆదిత్యహృదయ పారాయణ విశిష్టతను సమాజానికి విశేషంగా తెలియజేస్తూ కాయగూరలు ఆరోగ్యాన్ని కాపుకాసే అంశాలను సవివరంగా అందిస్తూ దేశ విదేశాల్లో అనేక ప్రసంగాలు చేస్తూ ఆరోగ్య రక్షణకు తమ వంతు సేవను అందిస్తున్న విక్రమాదిత్య తో ఈ సమావేశం ఏర్పాటు చేశామని,వినియోగించుకోమని కోరుతున్నామని,సదస్సు అనంతరం తాము ఏర్పాటు చేసిన సాత్విక శాఖాహార విందును స్వీకరించమని ట్రస్ట్ అందరికీ ఆహ్వానం అందజేసింది.