ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల విస్సన్నపేట స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడ్డల రాంబాబు అధ్యక్షతన జాతీయ పతాక జెండాను ఆవిష్కరించి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు గుడ్డల రాంబాబు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ ఉపసత్య గ్రహం చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుక్కడపు ప్రసాదరావు గోళ్ళ వెంకట గురునాథరావు జిల్లా నాయకులు లక్కీ పోగు వెంకట్రావు మండల ప్రధాన కార్యదర్శి పగుట్ల శాంత భూషణం పి నాగేశ్వరరావు గుడ్డల శ్రీనివాసరావు ఎం సత్యానందం తదితరులు పాల్గొన్నారు.