Subscribe Us

header ads

రాజ్యాంగమే మన జాతీయ గ్రంథం గన్నవరం మండలం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజ బెత్ రాణి.


 భారత రాజ్యాంగమే మన జాతీయ గ్రంధం మనది లౌకిక రాజ్యం మతం వ్యక్తిగత అంశం అని మన రాజ్యాంగం చెప్తుంది.అందుకే రాజ్యాంగమే మన జాతీయ గ్రంథం అవుతుంది అని విరపనేనిగుడెం గ్రామంలో డా బి అర్ అంబేత్కర్ గురుకుల పాటశాలలో గణతంత్ర దినోత్సవం కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీమతి ఏషోద లక్ష్మి తో కలిసి గన్నవరం జెడ్పిటిసి అన్నవరపు ఎలిజా బెత్ రాణి పాల్గొన్నారు.

ఆమె మొదట జాతీయ జెండాను ఎగురా వేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి విముక్తమై భారతదేశం స్వతంత్ర దేశమైంది. దేశరాజ్యాంగాన్నిరూపొందించేందుకు  1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది దానిని ఇంగ్లీష్, హిందీ భాషలలో చేతిరాతతో తయారు చేసి 1950 జనవరి 24న సంతకాలు చేసి ఖరారు చేశారు.అలా తయారైన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే ‘’భారత గణతంత్ర’’ దినం 1950 జనవరి 26. చారిత్రాత్మకంగా ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యం దష్ట్యా జనవరి 26వ తేది గణతంత్ర దినంగా ఎంపిక చేశారు.

భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశమంతటా వాడవాడలా ప్రజలు జాతీయ పతకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకొంటారు. ఈరాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. ఆరాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు,ప్రాథమిక విధులు మరియు ఆదేశిక సూత్రాలు ఉన్నాయి.ప్రతి భారతీయుడు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి.రాజ్యాంగాన్ని గౌరవించాలి.అలాగే రాజ్యాంగంలో మనం వాసుకొన్నాదాని ప్రకారం ప్రతి వ్యక్తికి విద్య, వైద్యం, ఉపాధి,అవకాశాలు చూపించాలి అది మన రాష్ట్రం లో నూటికి నూరు శాతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మధ్య దళారులు లేకుండా అమలు చేశారు అలాగే నగదు సహాయం డైరెక్టుగా పేదలు అకౌంట్లో వేశారు.ఈ పథకాలను గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గారు నియోజకవర్గంలో ప్రజలందరికీ  ఇంకా అవసరం అనుకుంటే తన స్వంత నిధులతో సహాయపడి ప్రజలకు సేవ చేసారు అని అన్నారు.

 2024 లో జరిగే ఎన్నికలలో వీరిద్దరినీ గెలిపించుకోవాలని ఆమె పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమం లో విరపనేనివారిగుడెం ఎంపిటిసి నందిపాటి పద్మ,వైఎస్సార్ పార్టీ నాయుకులు నాందిపాటి సుబ్బారెడ్డి గారు విద్యా కమిటీ చైర్మన్  తదితరులు పాల్గొన్నారు.