Subscribe Us

header ads

శుభ్రత కరువైన కూచిపూడి బస్ స్టాండ్ ఆవరణ


 పామర్రు నియోజకవర్గం:   కూచిపూడి బస్టాండ్ ఆవరణలో గత కొన్ని రోజులుగా చెత్త చెదారం నిల్వ ఉండి, మురుగు నీరు చేరడంతో దుర్వాసన వస్తుందని స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కూచిపూడి బస్టాండ్ ప్రక్కన కూరగాయల మార్కెట్లో మిగిలి చెత్త చెదారం ను బస్టాండ్ ఆవరణలో పడవేయడం, అదేవిధంగా గత కొన్ని రోజులుగా మురుగునీరు నిల్వ ఉండి విపరీతమైన ఈగలు, దోమలు, చేరి ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొల్లూరి వెంకట శ్రీనివాసరావు ఆదివారం అవనిగడ్డ డిపో మేనేజర్ కు సమాచారం అందించారు. డిపో మేనేజర్ ఆదేశాల మేరకు కె.వి రావు అవనిగడ్డ డిపో ఏ డి సి కూచిపూడి బస్ స్టాండ్ చేరుకుని బస్టాండ్ ఆవరణను పరిశీలించి, డిపో మేనేజర్ కి సమాచారం అందించారు. త్వరలో శుభ్రత కార్యక్రమాలను చేపడతామని డిపో మేనేజర్ తెలియజేశారు.