Subscribe Us

header ads

జయహో బీ.సీ


 భీమిలి నియోజకవర్గం పరిధి తగరపువలస కూడలి చిట్టివలస ఫుట్బాల్ గ్రౌండ్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు  నారా చంద్రబాబు నాయుడు  సూచనల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చం నాయుడు ఆదేశాలు అనుసారంగా   టిడిపి ఇంచార్జ్ కోరాడ రాజబాబు  ఆధ్వర్యంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి గీత విద్యా సంస్థలు అధినేత మతుకుమిల్లి  భరత్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా మొదటిగా ముఖ్యఅతిథిగా  భరత్ కి పుష్పగుచ్చం ఇచ్చి సాలువుతో సత్కరించి  సత్కరించి భీమిలి రూరల్ మండలం నాయకులతో బహిరంగ సభ నిర్వహించి అనంతరం అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి తాతా థియేటర్ మీదుగా వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజబాబు  మాట్లాడుతూ బీ.సీ కులాలకు వైసిపి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ గత తెలుగుదేశం పార్టీ హయాంలో బీ.సీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను గుర్తుచేసుకుని అత్యధికంగా ఉన్నటువంటి బీ.సీ ఓటర్లతో ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు వాళ్ళని నిర్లక్ష్యం చేయడం వైసీపీ ప్రభుత్వానికి తగదని తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో బీ.సీల సత్తా చాటే విధంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత ప్రతి ఒక్కరూ తమ భుజాలపై వేసుకొని తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేసే దాకా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి  పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డి.ఏ.ఎన్. రాజు, గాడు చిన్ని కుమారి, తమ్మిన సూరి బాబు, కోరాడ రమణ, వానపల్లి సత్యనారాయణ తదితరలు నాయకులు పాల్గొన్నారు