పామర్రు నియోజకవర్గం: తోట్లవల్లూరు మండలం యాకమూరు గ్రామం వద్ద ఆదివారం చెరుకు లోడుతో తోట్లవల్లూరు నుండి ఉయ్యూరు వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పల్టీ కొట్టడంతో కరెంటు స్తంభం విరిగి వైర్లన్నీ రోడ్లమీద పడ్డాయి. ట్రాక్టర్ డ్రైవర్ వెంటనే ట్రాక్టర్ పై నుంచి దూకి విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి సహాయ చర్యలు చేపట్టారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.