Subscribe Us

header ads

ఇర్రిపాక లో కోటి మట్టి శివలింగాల తయారీని పరిశీలించిన స్వామీజీ శ్రీ వాత్సల్య ధర్మ వీర


 జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో ఏలేరు నది తీరాన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద కోటి మట్టి శివలింగాలతో మహా కుంభాభిషేకం నిర్వహించి తలపెట్టిన జ్యోతుల నెహ్రూ కుటుంబం రాష్ట్రం నలుమూల నుండి విచ్చేస్తున్న భక్త జన సందోహం మట్టి శివలింగాలు తయారీ చేయడం జరుగుతుంది. ఇక్కడ కోటి పార్దివ శివలింగాల తయారీ జరుగుతుంది అని తెలుసుకుని అరుణాచలం శ్రీవత్స పీఠం (తిరువణికమలై) పీఠాధిపతి స్వామీజీ శ్రీ వాత్సల్య ధర్మ వీర స్వామివారి విచ్చేసి లింగాల తయారీని వీక్షించారు. అనంతరం జ్యోతుల నెహ్రూ తో మాట్లాడుతూ ఈ బహుత్తర మహా యజ్ఞంలో కుంభాభిషేకం జరిగే సమయంలో 11 రోజులలో ఒకరోజు నేను కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటానని అన్నారు.యజ్ఞాన్ని నిర్వహిస్తున్న జ్యోతుల నెహ్రూ కుటుంబానికి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో జ్యోతులమణి టీ సర్వారాయుడు టీ సునీతబి సుబ్బారావు ఏ సత్తిబాబు ఎన్ రాంబాబు డి రాజు జ్యోతుల వీరభద్రరావు,డి బుజ్జి పి లోకేష్ కే సత్యానందం తదితరులు పాల్గొన్నారు.