గోకవరం మండలం గోకవరంలో ఎస్.వి.ఆర్ ఫంక్షన్ హాల్ నందు గోకవరం ఎంపీపీ సుంకర శ్రీ వల్లి వీరబాబు ఆధ్వర్యంలో వైస్సార్సీపీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జగ్గంపేట నియోజకవర్గం ఇంచార్జ్ మరియు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం హాజరు కాగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 1న ఏలూరులో జరగబోయే ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభ విజయవంతం కావాలని గోకవరం మండల నాయకులను కార్యకర్తలను అభిమానులను కోరడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమం పాల్గొన్న వాలంటీరలను, యానిమీటర్లను ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందరికి చేకురేలా చూడాలిని అలాగే మీకు ఏమైనా ఉద్యోగరిత్యా సమస్యలు గాని ఇబ్బందలు గాని ఉంటే తెలియజేయండి అని అడగడం జరిగింది. ఈ కార్యక్రమం లో అధికారులు మండల నాయకులు ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డ్ మెంబరలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.