Subscribe Us

header ads

ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సి.ఐ ప్రభాకర్..


కృష్ణాజిల్లా: మంజీర గళం ప్రతినిధి మొవ్వ: పామర్రు నియోజకవర్గం: కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు సి.ఐ ప్రభాకర్ గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఐ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆటోలలో పరిమితిని మించి ప్యాసింజర్లను గాని, స్కూల్ విద్యార్థులను గాని, ఎక్కించకూడదని తెలియజేశారు. ఆటోలో ఎక్కిన ప్రయాణికులతో తమర్యాదగా ప్రవర్తించకూడదని, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని, ట్రాఫిక్ కు అంతరాయం కలిగేలా ఆటోలను ఎక్కడపడితే అక్కడ నిలుపుకూడదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన పక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా వారి డ్రైవింగ్ లైసెన్సుని రద్దు చేయడం జరుగుతుందని ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి ఎస్.ఐ డి.సందీప్ పాల్గొన్నారు.