భీమిలి లో ప్రియుడు చేతిలో వివాహిత హత్య
ప్రియుడే హత్య కు కారణం
పోలీసుల అదుపులో నిందితుడు
(మంజీర గళం ప్రతినిధి) ఆనందపురం
భీమిలి మండలం చేపల తిమ్మాపురంలో వివాహేతర సంబంధంతో మహిళ దారుణ హత్యకు గురైంది, వివరాల్లోకి వెళితే చేపల తిమ్మాపురంలో నివసిస్తున్న కోనాడ. రామ తల్లి (43) భర్త కొన్ని ఏళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటినుంచి ఇద్దరు పిల్లలతో చేపల తిమ్మాపురంలో నివాసం ఉంటుంది. రామ తల్లికి గరికిన దేముడు (47) తో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడి సహజీవన సాగిస్తున్నారు.
వ్యక్తిగత మనస్పర్ధలతో
రామ తల్లిని ఇంట్లో అతి కిరాతకంగా మెడకు తాడు చుట్టి మంచానికి కట్టి హత్య చేశాడు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి ఏసీపీ బి. సునీల్ కుమార్, సీ.ఐ.డి.రమేష్, చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమిలి పోలీసు వారు నిందితుడిని అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.