బిల్డింగ్ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి
(మంజీర గళం ప్రతినిధి) మొవ్వ:
పామర్రు నియోజకవర్గం: రాష్ట్రంలో లక్షలాదిమంది బిల్డింగ్ కార్మికులు సంక్షేమ బోర్డులు రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని, సంక్షేమ బోర్డు ద్వారా వివిధ పథకాలు అమలు చేయాలని, మెమో నెంబర్ 12,14, రద్దు చేయాలని, కోరుతూ కృష్ణాజిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సి.ఐ.టి.యు పామర్రు నియోజకవర్గ స్థాయిలో మండల కేంద్రమైన మొవ్వ గ్రామంలో రెండు రోజుల నిరాహార దీక్షలు బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి వేము పెదబాబు కార్మికులకు పూలమాలలు వేసి నిరాహార దీక్ష కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బిల్డింగ్ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా వివిధ పథకాలను కొనసాగించి, కార్మికులను ఆదుకోవాలని కోరారు. బుధవారం మరియు గురువారం జరిగే నిరాహార దీక్ష కార్యక్రమంలో బిల్డింగ్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
మొదటి రోజు బుధవారం ప్రారంభించిన నిరాహార దీక్ష కార్యక్రమంలో ఎస్.కె అల్లా బక్షు, చిగురుపల్లి సుబ్రహ్మణ్యం, ఓరుగంటి బాబురావు, కాకి రాజశేఖర్, ఇంటి రాజు, ఏనుగు శ్రీనివాసరావు, (కొండలు) ఇటికల ఏసుపాదం, బుద్ధుల మురళి, మన్నే మోహన్, బిల్డింగ్ కార్మికులు, కవులు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శీలం నారాయణరావు, సి.ఐ.టి.యు జిల్లా వైస్ ప్రెసిడెంట్ బడుగు గంగాధర ప్రసాద్, మొదలగువారు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.