హనుమాన్ జంక్షన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర టిడిపి నాయకులు
(మంజీరగళం ప్రతినిధి) బాపులపాడు
కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ లోని ప్రఖ్యాత అభయాంజనేయ స్వామి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్ల మీద ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు తీసుకుని ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ప్రత్యేక
కండువాను తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబుకు,పవన్ కళ్యాణ్ కు ఇవ్వడానికి తీసుకుని వెళ్లారు.రాష్ట్ర టిడిపి నేత ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కు వెళ్లిందని రాష్ట్ర ప్రజలందరినీ జగన్మోహన్ రెడ్డి పేదరికంలోకి నెట్టివేశాడని తెలుగుదేశం హయాంలో 2029 విజన్ రూపొందించడమే
అమరావతి, పోలవరం, పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేయడం జరిగిందని జగన్ పాలనలో పేదలు నిరుపేదలుగా మారిపోయారని వైసీపీ నాయకులు మాత్రం కుబేరులుగా అయ్యారని అన్నారు.వైసీపీ ప్రభుత్వం ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకునే దోపిడీ ప్రభుత్వంగా మారిందని అన్నారు.2024 శాసనసభ ఎన్నికల్లో టిడిపి-జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి రావాలని తెలియపరిచారు.గన్నవరం నియోజకవర్గం లో ఉన్న నాలుగు మండలాల్లోని టిడిపి-జనసేన శ్రేణులు సమన్వయంతో ఉండి ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు, మచిలీపట్నం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి వల్లభనేని బాలసౌరీలకు అత్యధిక మెజార్టీ తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి నాయకులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణరావు, చిరుమామిళ్ల సూర్యనారాయణ ప్రసాదు, దొంతు చిన్నా, వేగిరెడ్డి పాపారావు,బాపులపాడు మండల టిడిపి నాయకులు అట్లూరి శ్రీనివాసరావు,లింగం శ్రీధర్, యువత నాయకులు మందాడి రవీంద్ర, వెనిగళ్ళ జ్ఞాన శేఖర్ పాల్గొన్నారు.