Subscribe Us

header ads

లక్ష్మీపురం హరిహర క్షేత్రాన్ని దర్శించిన హోంమంత్రి తానేటి వనిత.

             


లక్ష్మీపురం హరిహర క్షేత్రాన్ని దర్శించిన హోంమంత్రి తానేటి వనిత.


మంజీరగళం ప్రతినిధి:దేవరపల్లి.       

గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన హరిహర క్షేత్రాన్ని రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సందర్శించారు.  హరిహర క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం, అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ముందుగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు వారికి స్వామి వారి శేషవస్త్రాలను కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. ఆ తర్వాత  జ్ఞాపికలను, ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణంలో హోంమంత్రి మొక్కను నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.