Subscribe Us

header ads

జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల.

 జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల.


 విద్యార్ధుల, తల్లుల జాయింట్ ఖాతాల్లో రూ.26.42 కోట్లు జమ 32,452 మంది విద్యార్థులకు లబ్ధి.

 (మంజీర గళం ప్రతినిధి )ఏలూరు.

 ఏలూరు జిల్లాలో  జగనన్న విద్యా దీవెన పథకం కింద   అక్టోబరు-నవంబరు 2023 త్రైమాసికానికి సంబందించి 32,452 మంది విద్యార్థులకు సంబంధించి వారి తల్లులు, విద్యార్ధుల జాయింట్ బ్యాంక్ ఖాతాలకు రూ. 26.42 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. 


ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి  శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో   నిర్వహించిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా తల్లులు, విద్యార్థుల, జాయింట్ ఖాతాల్లో డబ్బులు జమచేయగా ఈ కార్యక్రమంలో ఏలూరు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ నుంచి జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్, సోషల్ వెల్పేర్ జెడి జయప్రకాష్,  జిల్లా బి.సి. సంక్షేమాధికారి ఆర్.వి. నాగరాణి, మైనారిటి సంక్షేమాధికారి శ్రీనివాసరావు, పలువురు విద్యార్ధినీ, విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా విద్యార్థులకు నమూనా చెక్కును అందజేశారు.