ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అనకాపల్లి లోక్ సభ ని అద్భుతంగా మారుస్తా
ఆడారి కిషోర్ కుమార్
అనకాపల్లి, మంజీరగళం ప్రతినిధి :
రానున్న ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ స్థానానికి టికెట్ తనకు కేటాయిస్తే అద్భుతమైన అభివృద్ధి చేయిస్తానని తెలుగు దేశం పార్టీ యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. శనివారం అనకాపల్లి లోనీ వైవీ ఎంవి వేదికలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తన అంతరంగాన్ని వెల్లడించారు. అనకాపల్లి పట్టణంలో నే తాను పుట్టి, ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకూ పార్టీ చేయడం జరిగిందన్నారు. అనంతరం ఉన్నత విద్య కోసం దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థ హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పీజీ పూరి చేసి, అనంతరం లా లో ఎంఫిల్ చేశామన్నారు. ప్రస్తుతం న్యాయ విద్యలో పి హెచ్ డి చేస్తున్నానని తెలిపారు. స్కూల్ నుంచి పీజీ వరకూ ఆయా విద్యా సంస్థల స్టూడెంట్స్ యూనియన్ లకు అధ్యక్షునిగా పనిచేశానని తెలిపారు.నేటి నుంచి విద్యార్థుల సమస్యలు,ప్రజాసమస్యల లక్ష్య సాధన కోసం ఉద్యమాలు చేసి విజయం సాధించానని తెలిపారు. ప్రజా స్వామ్య రక్షణ కోసం గల్లి నుంచి ఢిల్లీ వరకూ విస్తృతంగా ఉద్యమాలు చేయడం జరిగిందన్నారు.త్వరలోనే యువత కోసం పెర్శనాలిటీ డెవలప్మంట్ లో శిక్షణ, మెగా జాబ్ మేళా నిర్వహించి సుమారు 10 వేల మందికి ఉపాధి కల్పించే మహా యజ్ఞం చేపడుతున్నామని తెలిపారు. వైద్య పరంగా ఎవరికైనా ఇబ్బందులు తలెత్తిన సందర్భాల్లో తగు సహకారం అందించేందుకు అన్ని వేళలా సిద్దంగా ఉంటానని తెలిపారు.ఇంటికో ఉద్యోగం వస్తె ఆ కుటుంబం ఆర్థికంగా మెరుగు పడుతుందని తెలిపారు.ఒక సాధారణ యువనేత గా ఇన్ని పనులు చేయగలిగినప్పుడు, ఒక ఎంపి గా చట్ట సభకు ఎన్నికైతే మరిన్ని మెగా ప్రాజెక్ట్ లు విజయ వంతంగా నిర్వహించాలని తెలిపారు. అనకాపల్లి లోక్ సభ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రత్యేక బ్లు ప్రింట్ ఉందనీ తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యల పై పూర్తి అవగాహన, ప్రజా బలం, సామాజిక వర్గం మద్దతు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.తెలుగు దేశం పార్టీ కోసం అన్ని వేళలా నిబద్దత కల్గిన కార్యకర్త గా పనిచేశానని ఆడారి కిషోర్ కుమార్ తెలిపారు. గత నాలుగు న్నర ఏళ్లుగా పార్టీ ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితుల్లో సైతం గల్లి నుంచి ఢిల్లీ వరకూ విస్తృతంగా ఉద్యమాలు చేశానన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ సమయంలో హైదరాబాద్ లో రోడ్ల రాస్తారోకో, దిష్టి బొమ్మ దగ్ధం, విమనంలోను , విశాఖ విమానాశ్రయం లోనూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేసి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిననీ తెలిపారు. ఢిల్లీ వేదికగా పార్లమెంట్ మీడియా పాయింట్ , జంతర్ మంతర్, విజయ్ ఘాట్, ఇండియా గేట్, ఆంధ్ర భవన్, తదితర ప్రాంతాల్లో శీర్షాసనం, క్యాండిల్ ర్యాలి లు చేశామన్నారు.
తన అర్హతలు, గత ఉద్యమ చరిత్ర పూర్తిగా పరిశీలించి, తన అభ్యర్థిత్వాన్ని అనకాపల్లి లోక్ సభ టికెట్ తనకు కేటాయించాలని సదస్సు వేదికగా మరొక్కసారి తెలుగు దేశం అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లకు విన్నపం అందించారు.ఈ సమావేశం లో శొంట్యాన అప్పల రాజు, ఎల్లంపల్లి నాగేశ్వర రావు, దాడి అప్పల నాయుడు, అనిత, తదితరులు పాల్గొన్నారు.