ఆనందపురం పిహెచ్ లో మలేరియా డే ర్యాలీ
ర్యాలీలో పాల్గొన్న ఆనందపురం పీహెచ్ డాక్టర్ ఎం గంగు నాయుడు
(మంజీర గళం ప్రతినిధి) ఆనందపురం
ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం లో గల ఆనందపురం పీహెచ్ మలేరియా వ్యాధి పై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని అనందపురం మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ ఎం. గంగునాయుడు పిలుపు నిచ్చేరు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గురువారం పీహెచ్ సీ సిబ్బంది , ఏ ఎన్ ఎం శిక్షణ అభ్యర్థులతో లోడగలవానిపాలెం గ్రామం పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గా జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ మలేరియా వ్యాధి దోమలు కుట్టడం వల్ల వ్యాప్తి చెందుతుందని , అందువల్ల దోమల నివారణ కోసం ప్రజలంతా కృషి చేయాలన్నారు. దోమ లార్వ దశ లోనే నిర్మూలించాలని అన్నారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, ప్రతీ శుక్రవారం డ్రై డే సందర్భంగా ప్రజలు వారి ఇళ్లలో వున్న నీటి నీ పూర్తిగా తీసివేసి కొద్దిసేపు నీటిని నిల్వ ఉంచే పాత్రలు , గోలాలు ఎండ లో ఎండబెట్టాలన్నారు. దీనివల్ల దోమ లార్వా దశలోనే నిర్మూలించవచ్చన్నారు. ప్రజలంతా దోమలు కుట్టకుండా దోమతెరలు ఉపయోగించాలన్నారు.
ఎవరికైనా జ్వరం వుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో గానీ, గ్రామాల్లో వున్న హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ లో రక్త పరీక్ష చెంచుకోవాలని సూచించేరు.
మలేరియా అని నిర్ధారణ ఐతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితం గా చికిత్స ను అందిస్తామన్నారు.
సామాజిక ఆరోగ్య అధికారి పి. సాంబమూర్తి మాట్లాడుతూ దోమల నివారణ తోనే మలేరియా వ్యాధి సాధ్యమవుతుందని , దీనికోసం ప్రజలు ఆరోగ్య సిబ్బంది కీ సహకరించాలని కోరారు. ఆశ కార్యకర్తలు నీటి నిల్వలు చూసేటప్పుడు, లార్వా వుంటే వెంటనే నీటిని తీసివేసి నప్పుడు ప్రజలు సహకరించాలని సూచించారు. అలాగే రోడ్లమీద వున్న ఖాళీ కొబ్బరిబోండాలు , పాత టైర్లు లో వర్షం వచ్చినప్పుడు నీటి నిల్వలు చేరి దోమలు అభివృద్ధి చెందుతాయని , అందువల్ల వాటిని లేకుండా చేయాలని తెలిపేరు