Subscribe Us

header ads

సినర్జీ క్యాస్టింగ్స్ లిమిటెడ్ వారు మహిళలకు ఉద్యోగాలు

 సినర్జీ క్యాస్టింగ్స్ లిమిటెడ్ వారు మహిళలకు ఉద్యోగాలు

 క్యాంపస్ డ్రైవ్

 (మంజీర గళం ప్రతినిధి)

 భీమునిపట్నం 


ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్

 కళాశాలలో  సినర్జీ క్యాస్టింగ్స్ లిమిటెడ్ వారు   సంస్థ లో మహిళా సాధికారత లో భాగంగా  అత్యధిక సంఖ్యలో మహిళలకు ఉద్యోగాలు

 ఇచ్చుటకు క్యాంపస్ డ్రైవ్  నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపస్ డ్రైవ్ లో కళాశాలలో వివిధ బ్రాంచెస్ కు చెందిన  92 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు. ఇందులో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ నుండి 39 మందికి కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగం నుండి 37 మందికి , కంప్యూటర్ ఇంజనీరింగ్ నుండి 4, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ నుండి 12 మందికి  కంపెనీ వారు ఆఫర్ లెటర్స్ అందచేశారు. సెలెక్ట్ అయిన వారికి ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్ లో 14,000/- వరకు వేతనం లభిస్తుంది. ఈ క్యాంపస్ డ్రైవ్ లో కంపెనీ నుండి శ్రీనివాస్, సీనియర్ మేనేజర్,  సుబేదా బేగం, సీనియర్ ఆఫీసర్  పాల్గొన్నారు. ఈ ప్లేసెమెంట్ డ్రైవ్  డాక్టర్ సిహెచ్. మురళి కృష్ణ,   ఆధ్వర్యంలో ట్రైనింగ్ అండ్ ప్లేసెమెంట్ ఆఫీసర్  పి. శ్రీనివాస్ మరియు కమర్షియల్ అండ్ కంప్యూటర్ శాఖధిపతి డాక్టర్ జి. రాజేశ్వరి నిర్వహించారు.