పిడికిలెత్తిన పోలవరం.. కూటమి అభ్యర్థి నామినేషన్ ర్యాలీ ఘనవిజయం
వేలాదిగా తరలివచ్చిన జనసేన-టీడీపీ-బీజేపీ నాయకులు, కార్యకర్తలు.
మంజీరగళం ప్రతినిధి:బుట్టాయిగూడెం.
పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు కి, ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్ యాదవ్ కి అడుగడుగునా అపూర్వ ఆదరణ
గురువారం ఉదయం నర్సన్నపాలెంలోని కరాటం వై-జంక్షన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఏకంగా ఆరుగంటల పాటు ఫుల్ జోష్ లో కొనసాగి కేఆర్ పురం ఐటీడీఏ వద్ద ముగిసింది. ర్యాలీ అసాంతం వాహనశ్రేణితో కిక్కిరిసింది
పోలవరంలో కూటమి విజయానికి తొలి అడుగుగా నామినేషన్ ర్యాలీ విజయవంతం కావడంపై మూడు పార్టీల శ్రేణులు సంతృప్తి
ర్యాలీ పొడవునా అసెంబ్లీ ఓటు జనసేన గాజు గ్లాస్ గుర్తుకు, పార్లమెంట్ ఓటు టీడీపీ సైకిల్ గుర్తుపై వేసి ఎన్డీఏ కూటమిని గెలిపిస్తామన్న ప్రజలు