తోటి పీఎంపీ కీ చేయూత
మంజీరగళం ప్రతినిధి ):
గోకవరం :
గోకవరం మండలం కొత్తపల్లి గ్రామ పీఎంపీ సీనియర్ సభ్యులు పీఎమ్ దాస్ బ్రైయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న విషయం తెలుసుకుని ఆదివారం కమ్యూనిటీ పారామెడిక్స్&ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ది పీఎంపీ అసోసియేషన్) తూర్పుగోదావరి జిల్లా కోశాధికారి పీ.చిన్ని అధ్వర్యంలో మండల అధ్యక్షులు ఎమ్ నాగేశ్వరరావు సారధ్యంలో కొత్తపల్లి లో పీఎమ్ దాస్ కి జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు,జిల్లా కార్యదర్శి పీ దేవానందంజిల్లా ట్రెజరర్ P.చిన్ని చేతుల మీదుగా 27,500/-(ఇరవై ఏడువేల అయిదు వందల రూపాయలు) ఆర్ధిక సహకారం చేసారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు మాట్లాడుతూ పల్లెలో ప్రాధమికంగా ప్రధమ చికిత్సలందించే పీఎంపీలకు సంఘం అనేది వృత్తి పరిరక్షణకు ఒక భరోస అందించడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా సహాయ సహకారాలు అందించుటకు సభ్యులు ఐకమత్యమే కారణమని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వై పవన్ కుమార్,సహాయ కార్యదర్శి గంటి వెంకటేష్,పఠాన్ వలీ,గంటి బూరిబాబు తదితరులు పాల్గొన్నారు.పీ. చిన్ని ఈవిధంగా సహాయ సహకారాలు అందించిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.