జనార్ధనవరంలో కోళ్ల వ్యర్ధాలతో చేపల పెంపకం. పట్టించుకోని మత్స్య, రెవిన్యూ , పోలీస్ అధికారులు . ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? చెతులు దులుపు కుంటా రా ?
(మంజీరగళం ప్రతినిధి) చాట్రాయి:-
. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం జనార్దనవరం గ్రామంలో ప్రభుత్వ చెరువులో అధికారపార్టీ కి చెందిన వంగల సుబ్బారా వు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కోళ్ళ వ్యర్థాల తోచేపలుపెంచుతున్నారు. అన్నది బహిరంగరహస్యం.
కొవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ పోషక విలువ లున్న ఆహారానికి పెద్దపీట వేస్తున్నారు. అందునా మాంసాహార ప్రియులైతే చికెన్, మటన్‌తోపాటు చేపలపై మక్కువ చూపు తున్నారు. ఇలాంటి చేపల పెంపకానికీ కోళ్ల వ్యర్థాలను ఉపయోగిస్తూ, ఇటు జనం ఆరోగ్యం, అటు పర్యావ రణానికీ ముప్పు వాటిల్లే ప్రమా దాన్ని తీసు కొస్తు న్నారు వంగల సుబ్బా రావు లాంటి కొందరు స్వార్థపరులు. మన టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా నిషేధం ఉన్నా మన ల్నెవ్వడ్రా పీకేదీ అని చేపల పెంపకం దారుడు సుబ్బా రావు అంటున్నట్లు గ్రామప్రజలుఅంటున్నారు.
చెరువుల వద్ద కోళ్ల వ్యర్థాలను నిల్వ ఉంచడం వల్ల వైరస్ విస్తరించి పరి సరాల్లో ఉన్నవారు పలు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే భూగర్భ జలాలు కలుషితమై పర్యా వరణా నికి నష్టం కలుగ జేస్తు న్నారని, ఈ చెరువు చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బోర్లలోని నీరు సైతం ఒక రకమైన ఓసన ఒస్తున్నాయని,పోలాల్లోకి వచ్చినప్పుడు బోరు నీరు తాగలేక పోతున్నామని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం కోళ్ల వ్యర్థాలను చెరువుల్లోని చేపలకు ఆహారంగా వేయడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ రెండేళ్లుగా కోళ్ల వ్యర్థాల వ్యాపారం బాగా పుంజుకుంది. కొన్ని చోట్ల మూడు, నాలుగు రోజుల పాటు నిల్వ ఉంచి న కోళ్ల వ్యర్థాలను తరలిం చే క్రమంలో వాయు కాలు ష్యం వెదజల్లుతోంది. వ్యర్థాలను తీసుకెళ్లే వాహనాలు వెళ్లిన మార్గాల్లో కనీసం 10-20 నిమిషాల వరకు భరించ లేని దుర్గంధం వెదజల్లు తుండటంతో స్థానికులు తీవ్రఇబ్బందిపడుతున్నారు.ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులకు తెలియక పోవటం విచిత్రంగాఉందంటున్నారు గ్రామ ప్రజలు.చికెన్ దుకాణదారులు మొదట్లో కోళ్ల వ్యర్థాలను వృథాగానే పడేసే వారిని,దీనిపై కొందరి స్వార్థపరుల కన్ను పడింది. అంతే ఇంకే ముంది ఈ వ్యర్థాలతోనే వ్యాపారం మొదలు పెట్టేశారు. ఎక్కువగా వ్యర్థాలు వచ్చే చికెన్ దుకాణాల వద్ద ప్రత్యేకంగా ప్లాస్టిక్ డ్రమ్ములను సైతం ఏర్పాటు చేశారు. అయితే కొందరు చికెన్ దుకాణ దారులు వ్యర్థాలను ఈ డ్రమ్ముల్లో వేయకపోవడం తో కిలోకు రూ.5-8 లు వరకు లేదా డ్రమ్ముకి ఓ రేటు ఇస్తామని చెప్పారు. అంతే వ్యాపారులు సైతం వ్యర్థాలను భద్రపరిచి మరీ సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన వ్యర్థాల ను వాహనాల్లో తరలించి చేపల పెంపకం దారులకు కిలో రూ.15 ల వరకు విక్ర యిస్తున్నట్లు తెలుస్తుంది.
ఏలూరు జిల్లాలోచాట్రాయి, బూరుగ్గూడెం,పర్వతాపురం,చనుబండ,క్రిష్ణా రావులపాలెం మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని కందుకూరు,రాఘాపురం నుండి చింతలపూడి మండలం పోతునూరు, మల్లయగూడెం, శివాపురం మీదుగా చిన్నంపేట , కోటపాడు,మంకొల్లు, పోలవరం, మర్లపాలెం, తుమ్మ గూడెం, జనార్ధన వరం వరకు గ్రామాల్లో చికెన్ దుకాణం దారులు నుండి కోళ్ళ వ్యర్థాలు సేకరించి జనార్దనవరం తరలించి రాయకుంట చెరువులో తాను పెంచు తున్న చేపలకు వేస్తూ అదిక లాభాలు పోందు తున్నట్టు గ్రామ ప్రజలు చెబుతున్నారు.
సాధారణ రోజుల్లో 20,30 క్వింటాళ్ల వరకు,ఆదివారం చికెన్ వినియోగం ఎక్కువ గా ఉండటంతో ఆ రోజు తోపాటు మరుసటి రోజుకి సుమారు 2,3 టన్నులకు పైగా కోళ్ల వ్యర్థాలను సేకరించి రాయకుంట చెరువుకు తరలిస్తున్నారని తెలుస్తుంది. ఒక్క ఏలూరు జిల్లా పరిధిలోనే సగటున రోజుకు 50 టన్నుల కోళ్ల వ్యర్థాలు తరలి పోతున్నా యంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలోఉందోఅర్థంచేసుకోవచ్చు.కోళ్ల వ్యర్థాలను తినడం వల్ల చేపలు త్వరగా బరువు పెరగడం తోపాటు మేత ఖర్చు కూడా తగ్గుతుందని అంటున్నారు. సాధారణం గా చేపలకు ఆహారంగా తవుడు, సోయాబీన్ వంటి వాటితో ఉత్పత్తి చేసిన మేతను వాడతారు. ఈ మేత మార్కెట్‌లో కిలో రూ.30 వరకు ఉంటుంది. కిలో చేపను పెంచడానికి సుమారు రూ.50 లకు పైగా ఖర్చవుతుంది. కానీ ఆరోగ్యవంతమైన చేపలు ఈ ఆహారంతో అందు బాటులోకి వస్తాయి. అదే కోళ్ల వ్యర్థాలతో కిలో చేపను పెంచేందుకు రూ.30ల లోపే ఖర్చవు తుండ టం,త్వరగాచేపలుబరువు పెరుగుతుండటంతో వీటిపై నే కొందరుపెంపకందారులు దృష్టి సారిస్తున్నారు. అయితే ఈ చేపలను తినేవారు అనేక వ్యాధుల బారినపడతారనేవిషయాన్నివారుగ్రహించలేకపోతున్నారు.ఇకనైనా మత్స్య శాఖ,పోలీసు,రెవిన్యూ అధికారులు కోళ్లవ్యర్థాలు వాడే వారిపై నిఘా పెంచి తగు చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యా వరణ పరిరక్షణ చేపట్టాల్సి న అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభి ప్రాయం వ్యక్తంచేస్తున్నారు.