ఏలూరు/నూజివీడు:ఏలూరుజిల్లా, నూజివీడునియోజకవర్గం లోని ఇంటి ఇంటికి తిరిగి ఆగష్టు 13న మాదిగల విజయ యాత్ర ర్యాలీ ని జయప్రదం చేయడానికి ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి, ఎం ఈ ఎఫ్ అనుబంధ సంఘాల నాయకులు ప్రతీ ఒక్కరు కృషి చెయ్యాలని నూజివీడు నియోజకవర్గంపరిధిలో గల నాలుగుమండలాలు ఐననూజివీడు,ముసునూరు,అగిరిపల్లి చాట్రాయి మండలాల నుంచి భారీ సంఖ్యలో పాల్గొనేలా చూడాలి అనీ తెలియజేస్తున్నాము
అభినవ అంబేద్కర్, మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా మాదిగ, మాదిగ ఉపకులాల ఉజ్వల భవిష్యత్ కై సామాజిక న్యాయ సిద్ధాంతం అయిన SC వర్గీకరణ లక్ష్య సాధన కోసం నిరంతరం పోరాటం చేసి ఆగష్టు 01 న భారతదేశ అత్యున్నత న్యాయస్థానం SC వర్గీకరణ కు అనుకూలంగా తీర్పు నివ్వడం తో ఒక్క లక్ష్యం కోసం మందకృష్ణ మాదిగ తన జీవితాన్నే త్యాగం చేశారని ఆగస్ట్ 13 న హైదరాబాద్ కేంద్రం గా జరుగు మాదిగ ల విజయ యాత్ర ర్యాలీ ని యావత్ మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలు, సమాజం లో సామాజిక న్యాయ సూత్రాన్ని బలపరచ్చే అన్ని వర్గాల ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరడమైనది