ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ ఈరోజు భద్రాచలం పట్టణంలో మాదిగల ఆత్మీయ అభినందన సభ జరిగింది.ముందుగాభద్రాచలంపట్టణంలోని అంబేద్కర్ వి గ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, ర్యాలీ నిర్వహించడం జరిగింది. భద్రాచలం నియోజకవర్గం పరిధిలో వర్గీకరణ కోసం 30 సంవత్సరాల ఉద్యమంలో పాల్గొని అమరులైన మాదిగ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా ఉద్యమించిన మాదిగ ఉద్యోగులను, మాదిగ ఉద్యమకారులను, మాదిగ విద్యార్థి నాయకులను ఘనంగా సన్మానించుకోవడం జరిగింది.
అనంతరం మాదిగ ఉద్యోగులు, నాయకులు మాట్లాడుతూ....వర్గీకరణ సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. వర్గీకరణకోసం మాదిగ ఉద్యోగులు ఉద్యమంలో ఎనలేని పాత్ర పోషించారని కొనియాడారు. మాదిగ ఉద్యోగులు ఉద్యమకారులకు అండదండలు అందిస్తూ ఉద్యమకారులను ఉద్యమంలో ప్రోత్సహిస్తూ అండగా ఉన్నారని అన్నారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని కోరారు. చదువుకున్న మాదిగ నిరుద్యోగులు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని వర్గీకరణ అమలయితే నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని, విద్యార్థులందరికీ విద్యా అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. భవిష్యత్తు కాలంలో మాదిగలు అభివృద్ధి పథంలో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ నారాయణ రావు, భీమపాక పెదరాజు, గద్దల నరసింహారావు, ఎక్కిరాల శ్రీనివాసరావు,ఐనంపూడి జపాన్ రావ్, కోట దేవదానం, నహి మియా, ఉదయ్, రావులపల్లి సత్యం, ముద్దా పిచ్చయ్య, చాట్ల రవికుమార్, అలవాల రాజా, కొమ్మ గిరి వెంకటేశ్వర్లు, అవులూరి సత్యనారాయణ, గడ్డం వెంకటేశ్వర్లు, మందల రవికుమార్,కోట ప్రభాకర్,గుగ్గిళ్ళ నరేంద్ర, మచ్చ వీర్రాజు, కొప్పుల తిరుపతి,కొప్పుల మల్లూరి, పేరాల నాగరాజు, కోటా కిషోర్, కొప్పుల వెంకట్ , మేకల లత, పొట్ట పింజర ప్రకాష్, బొక్క రాంబాబు, సోదర వీరస్వామి, నలగట్ల శివకుమార్, అవులూరి రాము, అలవాల సతీష్, బోయ జగన్నాథం, రావులపల్లి ఈశ్వరయ్య, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.