ఏలూరు /నూజివీడు :ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గ పరిధిలో గల అన్నవరం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో అండర్- 14 విభాగంలో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివరాల్లోకి వెళితే... కర్నూల్ లో జరిగిన 7 వ ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల రోప్ స్కిప్పింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో అండర్ -14 విభాగంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్లో 8 వ తరగతి విద్యార్థినులు డి.జెస్సికా సిల్వర్ మెడల్ ను, జి.భవ్య బ్రాంజ్ మెడల్ ను సాధించారు.
అదేవిధంగా స్పీడ్ హాఫ్ విభాగంలో జి. షైనీ గోల్డ్ మెడల్ ను దక్కించుకొనగా, ఫ్రీ స్టైల్ విభాగంలో ఎస్. సునంద సిల్వర్ మెడల్ ను దక్కించుకున్నారు. అండర్ 14 విభాగంలో భాగంగా ఎం.డ్యూరెన్స్ విభాగంలో జి. అలేఖ్య సిల్వర్ మెడల్ ను సాధించింది. తదుపరి కళాశాల జూనియర్ బైపిసి విద్యార్థినులు అండర్- 17 విభాగంలోతమ సత్తా చాటగా స్పీడ్ హోప్ విభాగ్యంలో జి. భవ్యశ్రీ సిల్వర్ మెడల్ ను, అదేవిధంగా ఫ్రీ స్టైల్ విభాగంలో జి. శాంతి గోల్డ్ మెడల్ ను సాధించారని పాఠశాల/ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. శ్రీ లక్ష్మి తెలియజేశారు. ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీ మాట్లాడుతూ.... విద్యార్థినుల విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఆటలు అనేవి ప్రాముఖ్యమని తద్వారా పోటీ తత్వం పెరుగుతుందని, ఈ విజయానికి కారణమైన పాఠశాల పి ఈ టి పి. భవాని ఇచ్చిన శిక్షణ కారణమని, పిఈటిని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే అన్ని క్రీడ రంగాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరచాలని తద్వారా భవిష్యత్తుకు బాసటగా ఉంటుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, టీచర్లు,తల్లిదండ్రులు పాల్గొన్నా