ఏలూరు : కోళ్ల వ్యర్ధాలను చేపల చెరువులలో వినియోగిస్తే క్రిమినల్ తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. భీమడోలు మండలం పెదలింగంపాడు గ్రామంలో సోమవారం ఘంటా మోహనరావు, లంక నాని అనే ఇరువురు చెరువులకు మూడు లారీలలో కోడి వ్యర్ధాలు చేపల చెరువులకు తరలిస్తున్నారనే సమాచారంతో భీమడోలు తహసీల్దార్ ను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అప్రమత్తం చేసి, సదరు లారీలను సీజ్ చేసి, వ్యక్తులపై కేసులు నమోదు చేయాలనీ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ననుసరించి రెవిన్యూ, పోలీసు, మత్స్య శాఖ అధికారులతో కూడిన మండల టీం వెంటనే దాడిచేసి భీమడోలు రైల్వే గేటు వద్ద కోడి వ్యర్దాలతో ఉండి గ్రామమునకు వెళుతున్న (1).AP 39 UA 4993, (2). AP 39 UV 4649 (3)TS 11 UC 8478 నంబర్లు గల 3 లారీలను సీజ్ చేసి, ఘంటా మోహనరావు, లంక నాని లపై కేసులు నమోదు చేశారు. సదరు కోడి వ్యర్ధాలను భీమడోలు డంపింగ్ యార్డ్ నందు పూడ్చి పెట్టడం జరిగిందని భీమడోలు తహసీల్దార్ తెలిపారు.