AP NEWS: మెగా, అల్లు కుటుంబాల మధ్య వివాదాలు అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మధ్యలో ఆ ఫ్యామిలీలకు సన్నిహితులైన కొందరు ఏ పొరపొచ్చాలు లేవంటూ క్లారిటీ ఇస్తున్నప్పటికీ.. ఏదో రకంగా వివాదాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన కామెంట్స్‌ని సగం సగం వీడియోలు చూసి అల్లు అర్జున్‌కు ఆపాదించి మరీ సోషల్ మీడియాలో రచ్చ జరగటం చూస్తుంటే ఈ గ్యాప్ ఇప్పట్లో ఫిల్ అయ్యే అవకాశం అస్సలు కనిపించటం లేదు.
మెగా, అల్లు కుటుంబాల మధ్య వివాదాలు అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మధ్యలో ఆ ఫ్యామిలీలకు సన్నిహితులైన వారు.. వారి మధ్య ఏ పొరపొచ్చాలు లేవంటూ క్లారిటీ ఇస్తున్నప్పటికీ.. ఏదో రకంగా వివాదాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఇరు కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య వివాదాలంటూ అనేక పుకార్లు షికార్లు చేయటం, వాటిని ఖండించటం ఇప్పుడు కామనైపోయింది. సోషల్ మీడియాలో అయితే మెగా వర్సెస్ అల్లు అన్నట్లుగా పెద్ద యుద్ధమే జరుగుతుంది.
మరీ ముఖ్యంగా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారం ఈ రెండు ఫ్యామిలీల మధ్య పెద్ద చిచ్చుకు కారణమైందనేలా టాక్ మొదటి నుంచి వినబడుతోంది. అంతకు ముందు ఎన్ని వివాదాలు ఉన్నా.. ఎన్నికల వేళ అల్లు అర్జున్ చేసిన ఒక్క పని.. మెగా ఫ్యామిలీని బాగా హర్ట్ చేసింది. ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన భార్య ఫ్రెండ్ భర్తకు చేసిన స్నేహపూర్వకమైన సపోర్ట్ మెగా అభిమానులతో పాటు మెగా కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టిందనే వార్తలు ఇంకా వినబడుతూనే ఉన్నాయి. దీనిపై అటు మెగా కుటుంబ సభ్యులైన నాగబాబు, నిహారిక.. ఇటు అల్లు కుటుంబానికి ఆప్తుడైన బన్నీ వాస్ లాంటి వారు పలు సందర్భాలలో స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఎవరి వ్యక్తిగత ఇష్టం వారిదని ఒకరంటే.. గ్యాప్ ఫిల్ అయ్యే మూమెంట్ ఒకటి వస్తే చాలని మరొకరు మాట్లాడారు. ఇలా నడుస్తున్న ఈ కాంట్రవర్సీలోకి బెంగళూర్ వేదికగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఈ కాంట్రవర్సీకి మరింత ఆజ్యం పోసినట్లయ్యాయి.