Subscribe Us

header ads

నేషనల్ ఎం ఈ ఎఫ్ ప్రధాన కార్యదర్శిని కలిసిన ఉమ్మడి కృష్ణాజిల్లా ఎం.ఈ ఎఫ్ ప్రధాన కార్యదర్శి తొమ్మండ్రు యువరాజు


ఏలూరు: పట్టణం నందు శనివారం నాడు ఉదయం నేషనల్ ఎం ఈ ఎఫ్ ప్రధాన కార్యదర్శి కత్తి. వెంకటేశ్వర్లుని ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి టి. యువరాజు కలవడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అనుకూల తీర్పుపై ఇరువురి మధ్య సంభాషించుకోవడం జరిగింది. 30 ఏళ్ళగా ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేసి ఊహించని ఉప్పెనతో ఉద్యమాన్ని విజయ శిఖరానికి చేర్చిన మంద.కృష్ణమాదిగకి అభినందనలు తెలిపారు.

ఈ సంద్భంగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు చేసిన ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా కత్తి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఆంధ్ర ,తెలంగాణలో అతి త్వరలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి జాతి రుణం తిర్చుకోవాల్సిందిగా మాదిగ పెద్దన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 13 వ తారీఖు హైదరాబాదుకి విచ్చేస్తున్న మంద కృష్ణమాదిగకి ఘన స్వాగతం పలకడానికి వేలాది మంది ఎమ్మార్పీఎస్, ఎం ఈ ఎఫ్, కార్యకర్తలు హైదరాబాద్ కి తరలి రావాల్సిందిగా ఇరువురు పిలుపునిచ్చారు.