Subscribe Us

header ads

వైద్య ఖర్చులు కోసం షేక్ మస్తాన్ కు ఆర్ధిక సహాయం అందించిన కంబాల శ్రీనివాసరావు

(మంజీరగళం ప్రతినిధి ):గోకవరం 

గోకవరం గ్రామనికి చెందిన షేక్ మస్తాన్ తన చాలి చాలని చిన్న పురే గుడిసెలో నివాసం ఉంటూ,వర్షానికి తడుస్తూ,ఎండకు ఎండుతూ ఆర్థికంగా,అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు.షేక్ మస్తాన్ పరిస్థితిని విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకురాగా,తక్షణమే స్పందించిన ఆయన రామసేన సభ్యులతో కలిసి షేక్ మస్తాన్ ఇంటికి వెళ్లి పూరి గుడిసెను పరిశీలించి,అనారోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.ఆయన దయానియా స్థితిని చూసి చలించి పోయారు.తక్షణ సహాయంగా పదివేల రూపాయలు నగదను ఆయనకు అందజేశారు.ఈ సందర్భంగా రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ షేక్ మస్తాన్ కు భార్య చనిపోయిందని,పిల్లలు ఉన్నప్పటికీ దూరంగా ఉండటంతో అయన బాగోగులు చూసే వారు ఎవరు లేరని అన్నారు.భగవంతుడు అందరికీ ఒకటేనని,హిందూ క్రిస్టియన్,ముస్లిం అందరం అన్నదమ్ముల కలిసికట్టుగా బ్రతకాలన్నారు.తాను ఏ మతానికి వ్యతిరేకం కాదని, అన్ని మతాలవారు నాకు సమానమేనన్నారు.ముందు మానవత్వం,తర్వాత మతం అని భగవంతుడు మట్టుకు అందరికి ఒకటేనని,కుల మతాలకతీతంగా తమ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.ఈ కార్యక్రమంలో ఒక గ్రామ పెద్ద తమ్మన దొర,విశ్వ హిందూ దర్మ పరిరక్షణ రామసేనా సభ్యులు మామిడి అయ్యప్ప, తామర్ల రాంబాబు,ఇనకోటి బాపన్న దొర,వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథ రావు శర్మ, కట్టా నూకేశ్వర విజయ్ కళ్యాణ్ పాల్గొన్నారు