(మంజీర గళం ప్రతినిధి) ఆనందపురం
విశాఖలో భారీగా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు వర్షం కారణంగా బీచ్ రోడ్లో ప్రతిష్టాత్మకమైన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విశాఖలోని సోమవారం తెల్లవారు జామున స్థానిక ఆర్.కె. బీచ్ వద్ద ప్రారంభమయ్యింది. ఆదివారం రాత్రి ఆర్మీ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు పోర్టు స్టేడియంకు వచ్చారు. ర్యాలీ నిర్వహణకు పోర్టు స్టేడియంలో అన్ని ఏర్పాట్లూ చేసినప్పటికీ రాత్రి వర్షం కారణంగా ట్రాక్ అంతా తడిసిపోయింది. బురదగా ఉండి జారుతుందనే కారణంతో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు అధికారులు ర్యాలీని బీచ్ రోడ్లో నిర్వహించారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా అభ్యర్థులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అధికారులు దానికి తగిన ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్లు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో రిక్రూట్మెంట్ జరగనుంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఆర్మీ అధికారుల ప్రత్యేక టీంతో పాటు ఆర్మీ డైరెక్టర్కు సంబంధించిన మరో టీం ఎప్పటికప్పుడు పర్యవేక్షించనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్రప్రసాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.