సిపిఐ ప్రతినిధి బృందం సోమవారం ఎద్దుకొండ పరిశీలన ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం లో గల కుసులవాడ గ్రామపంచాయతీలో మైనింగ్ తవ్వకాలు ఆపాలని సిపిఎం యూనియన్ నాయకుడు ఈ సందర్బంగా సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు మాట్లాడుతూ ఆనందపురం మండలం కుసులవాడ గ్రామ సర్వే నెం 104 లో 7.991 హెటార్లలో సుమారు 20 ఎకరాలు చిన్న మెట్ట అను పిలవబడే (ఎద్దుమెట్ట) లో గ్రావెల్, రఫ్ స్టోన్, క్వార్ట్ జైట్ లను పెద్ద పెద్ద మిషన్లతో తవ్వి భారీ వాహనాలలో తరలించడం చేస్తే ఆనందపురం మండలంలో చుట్టు పక్కల సుమారు 60 గ్రామాలలో భూగర్భ జలాలు పూర్తిగా కాలుష్య కోరలలో చిక్కుకొని రైతుల పంట భూములు, సాగునీరు, త్రాగునీరు పూర్తిగా కలుషితం అవుతాయని ప్రజలు ఆరోగ్యం సర్వ నాశనం అవుతుందని ప్రజల జీవనస్థితి గతులకు నష్టం చేసే ఇటువంటి ప్రతిపాదనలు విరమించాలని తవ్వకాలు కోసం నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చెయ్యాలని విశాఖ జిల్లా సిపిఐ తరుపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అత్తిలి విమల, కసిరెడ్డి సత్యనారాయణ, పి చంద్రశేఖర్, సి ఎన్ క్షేత్రపాల్ తదితరులు పాల్గొన్నారు.