Subscribe Us

header ads

కోల్ కతా నగరంలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి డాక్టర్ కాకార్ల రామచంద్రబాబు

 
జంగారెడ్డిగూడెం:ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కాకర్ల రామచంద్రబాబు
 ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో  ర్యాలీ చేపట్టారు.
కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పై సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యాచారం అతిదారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాకని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ కాకార్ల రాణచాంద్రబాబు డిమాండ్ చేశారు.స్థానిక సుశీల హాస్పిటల్ నుండి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిరసన, అత్యాచార బాధితురాలికి నివాళి నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ78 ఏళ్ల భారత స్వాతంత్రదినోత్సవం జరుపుకొని అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్నామని ప్రకటిస్తున్న పాలకులకు మహిళలకు రక్షణ కల్పించే దుస్థితి లేకపోవడం  అన్నారు.విద్యావంతురాలు సమాజంలోప్రజల ఆరోగ్యం కాపాడటంలో తన వంతు పాత్ర పోషించాలనిముందుకు సాగడం కోసం వెళ్తున్నటువంటి ట్రైనీ డాక్టర్ పై కలకత్తా నగరానడిబొడ్డున హాస్పటల్లోనే అత్యాచారం జరగడం అనేటువంటిదిమహిళా రక్షణకు ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉన్నాయో అద్దం పడుతుందన్నారు. బేటి బచావో బేటి పడావో అంటూ ఒకరు మహిళా సాధికారత అంటూ మరొకరుప్రజలను మభ్యప్రజలను మభ్య పెట్టడం కోసంపేపర్ ప్రకటనల కోసం నినాదాలు చేస్తున్నారు తప్ప నిజంగామహిళల రక్షణ కోసము మహిళా సాధికారత కోసం కృషి చేయడం లేదని వారు దుయ్య
బట్టారు.

తక్షణమే ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార హత్య ఘటనపై సమగ్రమైనటువంటి విచారణ జరిపి నిందితులను ఎక్కడున్నా  తక్షణమేకఠినంగా శిక్షించాలని,మౌమిత కుటుంబాన్ని ఆదుకోవాలని లేనియెడల ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పలువురు  డాక్టర్ స్వామి,శివరామ్,శ్రీవర్మ,ప్రసాద్,అభిషేక, మల్హోత్రా, బిందు ఫిలిప్,కోమల, సౌజన్య, శ్రీహిత,కటన్ దొర,పోసేశ్వరావు,లక్ష్మణ్,తదితర డాక్టర్స్ మరియు సిబ్బంది పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.