పామర్రు : కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గ పరిధిలో గల మొవ్వ మండలమునందు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కూచిపూడి శాఖ వారి ఆధ్వర్యంలో శనివారం ఐదు పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు 14 వేల రూపాయల విలువగల నోట్ పుస్తకాలు, పెన్నులు, రంగు పెన్సిళ్లు, పెన్సిల్ కిట్లు, పంపిణీ చేశారు. పెదపూడి ఎం.పి.యు.పి పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులు 51 మందికి వీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి, ప్రధానోపాధ్యాయులు ఎస్.నాగమల్లేశ్వరరావు, ఉపాధ్యాయురాలు కంచర్ల నిర్మల, మానవత సంస్థ చైర్మన్ పిట్టు శ్రీనివాసరావు, అధ్యక్షులు తాళ్లూరి మోహన్ కుమార్, డైరెక్టర్లు పాగోలు రమేష్ బాబు, పసుమర్తి శ్రీలక్ష్మి, పసుమర్తి ఫణి, సి.ఆర్.పి తాతా సమర్పణ రావు, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా డి.ఎం.ఎఫ్ కూచిపూడి పాఠశాలలో 25 మందికి, ఎం.ఎం.ఎఫ్ కూచిపూడి పాఠశాలలో 19 మందికి, పెదపూడి ఉర్దూ పాఠశాలలో 15 మందికి, వీటిని పంపిణీ చేయడం జరిగినదని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మొదలగు వారు పాల్గొన్నారు.