Subscribe Us

header ads

పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే


 మంజీరగళం)ప్రతినిధి.లింగపాలెం

 ఏలూరుజిల్లా శనివారం ఉదయం (31.08.24) లింగపాలెం మండలం సింగగూడెం,గొల్లగూడెం గ్రామాలలో ఒకరోజు ముందుగానే పింఛను పంపిణీ కార్యక్రమం మొదలైనది, ఈ కార్యక్రమం లో ఎడతెరిపి కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా శాసన సభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గ్రామాలలో తిరుగుతూ పెన్షన్స్ అందించారు పెన్షన్ దారులు ఒకరోజు ముందే పెన్షన్ అందించడం పట్ల ఎంతో సంతోషం తో ఉప్పొంగిపోయారు వారి అభిమాన నాయకుడు రోషన్ కుమార్ ఇంత వర్షం లో వచ్చి పెన్షన్ అందించినందుకు కృతజ్ఞతలు తెలియ జేశారు ఈ కార్యక్రమం లో మండల పార్టీ ప్రెసిడెంట్ గరిమెళ్ల చలపతి, మాజీ ఎంపీపీ మోరంపూడి మల్లికార్జునరావు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ బొంతు రాంబాబు , అధికారులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు