Subscribe Us

header ads

నిరుపేదలకు భరోసాగా సామాజిక పెన్షన్లు


 చల్లపల్లి :

 ప్రభుత్వం చెల్లించే సామాజిక పెన్షన్లు ఎలాంటి ఆధారం లేని అభాగ్యుల జీవితాలకు భరోసాగా ఉంటున్నాయని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారు. చల్లపల్లి మండలం,చింతలమడ గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులతో కలసి పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం సామాజిక పెన్షన్లను తమ బాధ్యతగా భావించి ప్రతిష్టాత్మకంగా ప్రతి నెలా ఒకటవ తేదీనే క్రమం తప్పకుండా అందించడానికి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. గ్రామాలలో చాలామంది వృద్ధులు, దివ్యాంగుల జీవితాలు పెన్షన్లపై మాత్రమే ఆధారపడి ఉన్నాయన్నారు. ఇంటింటికి తిరిగి పెన్షన్ ల చెల్లింపులో కీలకపాత్ర వహిస్తున్న సచివాలయ ఉద్యోగుల నిబద్ధత స్ఫూర్తిదాయకమని సురేష్ బాబు పేర్కొన్నారు.